బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు

విధాత‌:వినియోగదారులను చమురు కంపెనీలు బాదేస్తున్నాయి.ఒక రోజు విరామం అనంతరం దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పైకి కదిలాయి.ఇప్పటికే ఆల్‌ టైమ్ గరిష్ఠ స్థాయికి ధరలు చేరాయి. శుక్రవారం పెట్రోల్‌పై లీటర్‌కు 29 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెంచాయి.తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.85కు చేరింది. లీటర్ డీజిల్‌ రూ.86.75కు పెరిగింది,ఈ నెలలో ఇప్పటి వరకు జూన్‌లో ఆరు సార్లు ఇంధన ధరలుపెరగ్గా.. మే 4వ తేదీ […]

బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు

విధాత‌:వినియోగదారులను చమురు కంపెనీలు బాదేస్తున్నాయి.ఒక రోజు విరామం అనంతరం దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పైకి కదిలాయి.ఇప్పటికే ఆల్‌ టైమ్ గరిష్ఠ స్థాయికి ధరలు చేరాయి. శుక్రవారం పెట్రోల్‌పై లీటర్‌కు 29 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెంచాయి.తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.85కు చేరింది. లీటర్ డీజిల్‌ రూ.86.75కు పెరిగింది,ఈ నెలలో ఇప్పటి వరకు జూన్‌లో ఆరు సార్లు ఇంధన ధరలుపెరగ్గా.. మే 4వ తేదీ నుంచి నేటి వరకు 23 సార్లు చమురు ధరలు పెరిగాయి.

మేలో వెలువడిన ఎన్నికల ఫలితాల ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.5.53, డీజిల్‌ రూ.5.97 పెరిగింది.వరుసగా ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు పెట్రోల్‌ బంకుకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.ఓ వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు ధరల పెరుగుదలతో జనం బెంబేలెత్తుతున్నారు,దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్‌ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతున్నది.దేశంలోనే అత్యధికంగా శ్రీగంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.106 మార్క్‌ను దాటగా.. డీజిల్‌ ధర రూ.99 దాటింది. మరో వైపు నిన్న అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ట్రేడింగ్ ముగిసే సమయానికి బ్రెంట్ బ్యారెల్‌కు 0.21 డాలర్లు తగ్గి..72.31 డాలర్లకు చేరుకుంది. యూఎస్‌ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్‌కు 0.21 తగ్గి.. 70.08 డాలర్ల వద్ద స్థిరపడింది.

ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా వున్నాయి..

ఢిల్లీలో పెట్రోల్‌ రూ.95.85.. డీజిల్‌ రూ.86.75

ముంబైలో పెట్రోల్‌ రూ.101.04.. డీజిల్‌ రూ.94.15

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.99.61, డీజిల్‌ రూ.94.56

చెన్నైలో పెట్రోల్‌ రూ.97.19.. డీజిల్‌ రూ. 91.42

కోల్‌కతాలో రూ.95.80.. డీజిల్‌ రూ.89.60

భోపాల్‌ రూ.104.01.. డీజిల్‌ రూ.95.35

రాంచీ పెట్రోల్‌ రూ.92.08.. డీజిల్‌ రూ.91.58

బెంగళూరులో పెట్రోల్‌ రూ.99.05, డీజిల్‌ రూ.91.97

పాట్నాలో పెట్రోల్‌ రూ.97.95.. డీజిల్‌ రూ.92.05

చండీగఢ్‌లో రూ.92.19.. డీజిల్‌ రూ.86.40

లక్నోలో పెట్రోల్‌ రూ.93.09, డీజిల్‌ రూ.87.15