Viral | చూసుకోవాలి కదమ్మా.. కూర్చి రంధ్రంలో వేలు పెట్టిన యువతి.. చివరికి ఎమైందంటే?

సోషల్‌ మీడియాలో “వైరల్” కావాలంటే ఎవరైనా డాన్స్‌ చేయాలి, ఫన్నీ వీడియో చేయాలి అనుకుంటారు. కానీ మలేషియాలోని ఈ మహిళ మాత్రం ఒక్క ‘కుర్చీ’తోనే సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్లాస్టిక్‌ కుర్చీ, అందులో చిన్న రంధ్రం, ఆ రంధ్రంలో చిక్కుకున్న యువతి వేలు ఈ సన్నివేశం చూసిన నెటిజన్లు నవ్వులు ఆపుకోలేకపోతున్నారు.

Viral | చూసుకోవాలి కదమ్మా.. కూర్చి రంధ్రంలో వేలు పెట్టిన యువతి.. చివరికి ఎమైందంటే?

సోషల్‌ మీడియాలో “వైరల్” కావాలంటే ఎవరైనా డాన్స్‌ చేయాలి, ఫన్నీ వీడియో చేయాలి అనుకుంటారు. కానీ మలేషియాలోని ఈ మహిళ మాత్రం ఒక్క ‘కుర్చీ’తోనే సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్లాస్టిక్‌ కుర్చీ, అందులో చిన్న రంధ్రం, ఆ రంధ్రంలో చిక్కుకున్న యువతి వేలు ఈ సన్నివేశం చూసిన నెటిజన్లు నవ్వులు ఆపుకోలేకపోతున్నారు. మలేషియాకు చెందిన ఓ మహిళ కుర్చీలో కూర్చున్నపుడు ఆమె కుడిచేతి చిటికెనవేలు ఆ ప్లాస్టిక్‌ కుర్చీ రంధ్రంలో ఇరుక్కుపోయింది. మొదట స్వయంగా వేలు తీయడానికి ప్రయత్నించింది. కాని కుర్చీ మాత్రం ‘నేను నిన్ను వదలను’ అన్నట్టు పట్టుకుంది. ఎంతకూ రాకపోవడంతో చివరికి ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించాల్సి వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ ఫైటర్లు సర్జరీ చేస్తున్నట్లు అతి జాగ్రత్తగా కుర్చీని కత్తిరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫైర్‌ఫైటర్లు కుర్చీని కత్తిరిస్తున్న దృశ్యం, మహిళ ప్రశాంతంగా కూర్చొన్న ఎక్స్ ప్రెషన్స్ చూసి తెగ నవ్వుకుంటున్నారు. ఇక నుంచి ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోవడానికి ముందు ఫైర్‌ ఎక్స్టింగ్విషర్‌ దగ్గర పెట్టుకోవాలి అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.