Viral News | కోమాలో నుంచి బయటకొచ్చి ముగ్గురు పిల్లల గురించి ఆరా తీసిన టీనేజర్.. షాక్‌లో పేరెంట్స్!

Viral News | మూడు వారాల తర్వాత కోమాలో నుంచి బయటకొచ్చిన ఓ టీనేజర్ అడిగిన ప్రశ్న అందర్నీ విస్మయానికి గురిచేసింది. కళ్లు తెరిచిన వెంటనే తన ముగ్గురు పిల్లల్ని చూడాలని ఆమె ఆరాటపడటం ఆశ్చర్యపరిచింది.

Viral News | మూడు వారాల తర్వాత కోమాలో నుంచి బయటకొచ్చిన ఓ టీనేజర్ అడిగిన ప్రశ్న అందర్నీ విస్మయానికి గురిచేసింది. కళ్లు తెరిచిన వెంటనే తన ముగ్గురు పిల్లల్ని చూడాలని ఆమె ఆరాటపడటం ఆశ్చర్యపరిచింది. అసలు పెళ్లి కానీ.. పిల్లలు లేని ఓ యువతి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చి.. వారిని ఏడేళ్ల పాటు పెంచానని చెప్పడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఫ్రాన్స్‌లోని లియోన్‌కు చెందిన 19 ఏళ్ల క్లేలియా వెర్డియర్ 2025 జూన్‌లో అధిక మోతాదులో మందులు తీసుకోవడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కోమాలోకి వెళ్లిపోయింది. అలా మూడు వారాల పాటు కోమాలో ఉన్న క్లేలియా ఇటీవల స్పృహలోకి వచ్చింది. కళ్లు తెరిచిన వెంటనే ఆమె తన తల్లిదండ్రుల గురించి కాకుండా.. తన ముగ్గురు కూతుళ్లు ఎక్కడా? అని ప్రశ్నించింది. తన పిల్లలను హాస్పిటల్‌కు తీసుకొచ్చి ఎందుకు చూపించడం లేదని ఆందోళన చెందింది. ఇది చూసి క్లేలియా తల్లిదండ్రులతో పాటు ఆస్పత్రి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే క్లేలియాకు అప్పటివరకు గర్భం దాల్చలేదు.. పెళ్లి కూడా కాలేదు. ఇదే విషయాన్ని క్లేలియాకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె దిగ్భ్రాంతికి గురైంది.

తనకు ముగ్గురు పిల్లలు జన్మించారని.. వారి పేర్లు మిలా, మైల్స్, మైలీ అని క్లేలియా చెప్పుకొచ్చింది. వారిని ఎంతో ప్రేమగా పెంచానని.. వారితో కలిసి గడిపిన క్షణాలు తనకు స్పష్టంగా గుర్తున్నాయని తెలిపింది. ఇందులో మైలీ పుట్టిన కొద్దిరోజులకే మృతిచెందిందని.. ఆ బాధ తనను ఇంకా వెంటాడుతూనే ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. “పిల్లలు జన్మించినప్పుడు ఉండే నొప్పి, ఒత్తిడి నిజంగానే అనిపించాయి. వారిని తొలిసారి చేతుల్లోకి తీసుకున్న అనుభూతిని మాటల్లో చెప్పలేను.”పేర్కొంది. వాళ్లకు నడక నేర్పడం, భోజనం తినిపించడం, నిద్రపుచ్చడం వంటి జ్ఞాపకాలు తన మెదడులో బలంగా నాటుకుపోయాయని భావోద్వేగానికి గురైంది. కానీ తనకు పిల్లలు లేరని.. అదంతా తన భ్రమ అని చెప్పడంతో అయోమయానికి గురయ్యాయని చెప్పింది. కానీ కలలో తను మాతృత్వపు మమకారాన్ని పూర్తిగా అనుభవించానని.. ఇప్పటికీ ఆ పిల్లలను మిస్ అవుతున్నానని భావోద్వేగానికి గురైంది.

అయితే న్యూరాలజిస్టుల ప్రకారం.. కోమాలో ఉన్న సమయంలో చాలామందికి తీవ్రమైన కలలు, భ్రమలు కలుగుతుంటాయని చెబుతున్నారు. మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు లేదా గాయాలు అయినప్పువు వాస్తవంలా అనిపించే కలలు రావడం జరుగుతుందని వివరించారు. అయితే కొందరికీ కోమా తర్వాత ఏమీ గుర్తుండవు అని.. మరికొందరికీ మాత్రం అన్ని స్పష్టంగా గుర్తంటాయని స్పష్టం చేస్తున్నారు.

Read More:

Viral News | శోభనం రాత్రి భార్యను మేకప్ లేకుండా చూసి కంగుతిన్న కొత్త పెళ్లి కొడుకు.. గదిలో నుంచి పరార్!

Jackpot | ఇది కదా అదృష్టమంటే.. పాత ప్యాంటులో దొరికిన లాటరీ టికెట్‌కు కోట్ల రూపాయల జాక్‌పాట్!

Latest News