BRS పెట్టుకోండి.. VRS తీసుకోండి.. ఎవరొద్దన్నారు: ఎమ్మెల్యే రఘునందన్ రావు
విధాత: సీఎం కేసీఆర్ అసెంబ్లీని తన రాజకీయానికి వేదికగా మార్చుకున్నారని.. ఇది దురదృష్టకరమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ధ్వజమెత్తారు. పరోక్ష మిత్రుడు కాంగ్రెస్, ప్రత్యక్ష మిత్రుడు ఎంఐఎం, టీఆరెఎస్ కూడబలుక్కొని వాళ్లే అసెంబ్లీలో మాట్లాడారని.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. ఈమేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ. ‘కరెంట్ విషయంలో కేంద్రంపై మాట్లాడిన భట్టి విక్రమార్క.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంపై మాట్లాడలేదు. విద్యుత్తు సంస్కరణ బిల్లు-2020ని ఈ ఏడాది పార్లమెంట్‌లో […]

విధాత: సీఎం కేసీఆర్ అసెంబ్లీని తన రాజకీయానికి వేదికగా మార్చుకున్నారని.. ఇది దురదృష్టకరమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ధ్వజమెత్తారు. పరోక్ష మిత్రుడు కాంగ్రెస్, ప్రత్యక్ష మిత్రుడు ఎంఐఎం, టీఆరెఎస్ కూడబలుక్కొని వాళ్లే అసెంబ్లీలో మాట్లాడారని.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు.
ఈమేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ. ‘కరెంట్ విషయంలో కేంద్రంపై మాట్లాడిన భట్టి విక్రమార్క.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంపై మాట్లాడలేదు. విద్యుత్తు సంస్కరణ బిల్లు-2020ని ఈ ఏడాది పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి సెలక్ట్ కమిటీకి పంపారు ఇంకా పాస్ కాని ఈ బిల్లు గురించి అసెంబ్లీలో చర్చించారు’ అని రఘునందన్ ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షాలను గౌరవించడం మీ నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఉద్దేశించి రఘునందన్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. రేపు తమకు మాట్లాడే అవకాశం ఇస్తే మీరు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.
ఈ రెండ్రోజులు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగానే అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఖరారు చేశారని ఆరోపించారు. “జాతీయ పార్టీ పెట్టొద్దని ఎవరన్నారు? బీఆర్ఎస్ పెట్టుకోండి.. వీఆర్ఎస్ తీసుకోండి.. లేదంటే ఫాంహౌసు పరిమితం కండి. మాకేం అభ్యంతరం లేదు.
కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో కలవాలని అడుగుతున్నారు. పాత సంస్థానంలోని ప్రాంతాలు తెలంగాణలో కలవాలని తీర్మానం చేయండి.. ఎవరొద్దన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని విద్యుత్ బిల్లులో ఎక్కడా లేదు” అని రఘునందన్ అన్నారు.