10 రోజుల్లో ‘రైతుబంధు’

విధాత‌: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు శుభవార్త తెలిపారు. యాసంగి సీజన్ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు బంధు నిధులు పంపిణీ చేయాలని అధికా రులను ఆదేశించారు ఎకరానికి రూ.5వేల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు దాదాపు రూ. 7,500 కోట్ల నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న టీఆర్ఎస్ […]

10 రోజుల్లో ‘రైతుబంధు’

విధాత‌: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు శుభవార్త తెలిపారు. యాసంగి సీజన్ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు బంధు నిధులు పంపిణీ చేయాలని అధికా రులను ఆదేశించారు ఎకరానికి రూ.5వేల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు దాదాపు రూ. 7,500 కోట్ల నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు నిన్న టీఆర్ఎస్ ఎంపీలతో జరిగిన సమావేశంలో.. సీఎం కేసీఆర్ ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15 నుంచి అంటే మరో పది రోజుల్లో తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.