5 రాష్ట్రాల ఎన్నికలు: సీఎంల పరిస్థితి
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నందిగ్రాంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉండగా, భాజపా అభ్యర్థి సువేందు అధికారి 8వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడులో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కొళత్తూరులో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ సైతం ముందంజలో ఉన్నారు. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, మాజీ సీఎం ఊమెన్ చాందీ, భాజపా సీఎం అభ్యర్థి మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఆధిక్యంలో ఉన్నారు. అసోంలో ముఖ్యమంత్రి […]

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నందిగ్రాంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉండగా, భాజపా అభ్యర్థి సువేందు అధికారి 8వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడులో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కొళత్తూరులో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ సైతం ముందంజలో ఉన్నారు.
కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, మాజీ సీఎం ఊమెన్ చాందీ, భాజపా సీఎం అభ్యర్థి మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఆధిక్యంలో ఉన్నారు. అసోంలో ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ముందంజలో కొనసాగుతున్నారు. పుదుచ్చేరిలో యానాం నుంచి పోటీచేసిన సీఎం అభ్యర్థి రంగస్వామి ఆధిక్యంలో ఉన్నారు.