కేర‌ళ‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌

విధాత‌(తిరువ‌నంత‌పురం): దేశంలో క‌రోనా కేసులు శ‌ర‌వేగంగా పెరుగుతున్నాయి. రోజూ ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. వేల‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాలు నైట్ క‌ర్ఫ్యూలు, కంప్లీట్ క‌ర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్‌లు, సంపూర్ణ లాక్‌డౌన్‌ల వంటి ఆంక్ష‌లు విధిస్తున్నాయి. తాజాగా కేర‌ళ ప్ర‌భుత్వం కూడా రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది. రాష్ట్రంలో ఎనిమిది రోజుల‌పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నామ‌ని, ఈ నెల 8న ఉద‌యం ఆరు గంట‌ల నుంచి 16న అర్ధ‌రాత్రి వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో […]

కేర‌ళ‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌

విధాత‌(తిరువ‌నంత‌పురం): దేశంలో క‌రోనా కేసులు శ‌ర‌వేగంగా పెరుగుతున్నాయి. రోజూ ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. వేల‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాలు నైట్ క‌ర్ఫ్యూలు, కంప్లీట్ క‌ర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్‌లు, సంపూర్ణ లాక్‌డౌన్‌ల వంటి ఆంక్ష‌లు విధిస్తున్నాయి. తాజాగా కేర‌ళ ప్ర‌భుత్వం కూడా రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది.

రాష్ట్రంలో ఎనిమిది రోజుల‌పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నామ‌ని, ఈ నెల 8న ఉద‌యం ఆరు గంట‌ల నుంచి 16న అర్ధ‌రాత్రి వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ తెలిపారు. క‌రోనా సెకండ్ వేవ్‌లో భాగంగా కేసులు పెరుగుతుండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.