బార్‌ కౌన్సిల్‌తో నాకు ఎనలేని అనుబంధం ఉంది

విధాత‌: బార్‌ కౌన్సిల్‌తో నాకు ఎనలేని అనుబంధం ఉందని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఘనంగా సత్కారం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మా మూలాలు బార్‌ కౌన్సిల్‌ నుంచే మొదలయ్యాయి. ఖర్చులు, విచారణలో జాప్యం న్యాయవ్యవస్థకు అతిపెద్ద సవాల్‌. ఆ సవాల్‌ను అధిగమించేందుకు నా వంతు కృషి చేస్తాను. కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రజలు న్యాయవాదులపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకునే […]

బార్‌ కౌన్సిల్‌తో నాకు ఎనలేని అనుబంధం ఉంది

విధాత‌: బార్‌ కౌన్సిల్‌తో నాకు ఎనలేని అనుబంధం ఉందని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఘనంగా సత్కారం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మా మూలాలు బార్‌ కౌన్సిల్‌ నుంచే మొదలయ్యాయి. ఖర్చులు, విచారణలో జాప్యం న్యాయవ్యవస్థకు అతిపెద్ద సవాల్‌. ఆ సవాల్‌ను అధిగమించేందుకు నా వంతు కృషి చేస్తాను. కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రజలు న్యాయవాదులపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకునే బాధ్యత ప్రతి న్యాయవాదిపై ఉంది. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని బాధ్యతలు నిర్వర్తించాలి’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వ్యాఖ్యానించారు.