దేశవ్యాప్తంగా 2కోట్లు దాటిన కరోనా కేసులు

దేశంలో కొవిడ్​ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 2కోట్ల మార్క్​ను​ దాటింది. సోమవారం ఒక్కరోజే 3.57 లక్షల‬ మంది వైరస్​ బారినపడ్డారు. వైరస్ ​బారినపడిన వారిలో మరో 3,449 మంది మృతిచెందారు. ★ దేశవ్యాప్తంగా కొవిడ్​-19 కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ★ కొత్తగా 3,57,229 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల మార్క్​ను చేరింది. ★ ఈ జాబితాలో 3.33 కోట్ల కేసులతో అమెరికా అగ్రస్థానంలో […]

దేశవ్యాప్తంగా 2కోట్లు దాటిన కరోనా కేసులు

దేశంలో కొవిడ్​ విలయతాండవం కొనసాగుతూనే ఉంది.

  • మొత్తం కేసుల సంఖ్య 2కోట్ల మార్క్​ను​ దాటింది. సోమవారం ఒక్కరోజే 3.57 లక్షల‬ మంది వైరస్​ బారినపడ్డారు.
  • వైరస్ ​బారినపడిన వారిలో మరో 3,449 మంది మృతిచెందారు.

★ దేశవ్యాప్తంగా కొవిడ్​-19 కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.

★ కొత్తగా 3,57,229 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల మార్క్​ను చేరింది.

★ ఈ జాబితాలో 3.33 కోట్ల కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది.

★ కొవిడ్​ సోకిన వారిలో మరో 3,449 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం కేసులు: 2,02,82,833

మొత్తం మరణాలు: 2,22,408

మొత్తం కోలుకున్నవారు: 1,66,13,292

యాక్టివ్ కేసులు: 34,47,133

★ కొవిడ్ సోకిన వారిలో 3,20,289 మంది కోలుకున్నారు.

★ దేశవ్యాప్త రికవరీ రేటు 81.91 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు 1.10 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

★ కరోనా కట్టడిలో భాగంగా.. ఇప్పటివరకు మొత్తం 15.89 కోట్ల కొవిడ్​ వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది