Corona Medicine: కరోనాపై పోరుకు 2డీజీ -డీఆర్‌డీవో ఛైర్మన్‌

Corona Medicine: కరోనాపై పోరుకు 2డీజీ అభివృద్ధి చేసినట్లు తెలిపారు డీఆర్‌డీవో సతీష్‌రెడ్డి. కోవిడ్‌పై 2డీజీ డ్రగ్‌ సమర్థంగా పనిచేస్తుందన్న ఆయన అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి కూడా ఇచ్చిందని స్పష్టం చేశారు. త్వరలో ప్రజలకు అందుబాటులోకి 2డీజీ డ్రగ్‌ వస్తుందన్నారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి ఈ డ్రగ్‌ మంచి ఫలితాన్నిస్తుందన్నారు. కృత్రిమ ఆక్సిజన్‌ అవసరాన్ని 2డీజీ ఔషధం తగ్గిస్తుందన్నారు. రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి దీన్ని రూపొందించామని, 2డీజీ డ్రగ్‌తో ప్రాణాపాయ స్థితి తప్పుతుందని చెప్పారు […]

Corona Medicine: కరోనాపై పోరుకు 2డీజీ -డీఆర్‌డీవో ఛైర్మన్‌

Corona Medicine: కరోనాపై పోరుకు 2డీజీ అభివృద్ధి చేసినట్లు తెలిపారు డీఆర్‌డీవో సతీష్‌రెడ్డి. కోవిడ్‌పై 2డీజీ డ్రగ్‌ సమర్థంగా పనిచేస్తుందన్న ఆయన అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి కూడా ఇచ్చిందని స్పష్టం చేశారు. త్వరలో ప్రజలకు అందుబాటులోకి 2డీజీ డ్రగ్‌ వస్తుందన్నారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి ఈ డ్రగ్‌ మంచి ఫలితాన్నిస్తుందన్నారు. కృత్రిమ ఆక్సిజన్‌ అవసరాన్ని 2డీజీ ఔషధం తగ్గిస్తుందన్నారు. రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి దీన్ని రూపొందించామని, 2డీజీ డ్రగ్‌తో ప్రాణాపాయ స్థితి తప్పుతుందని చెప్పారు సతీష్‌రెడ్డి.

కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతి కొనసాగుతున్న వేళ ఆక్సిజన్‌ కొరత కరోనా బాధితుల పాలిట శాపమై కూర్చుంది. దాన్ని అధిగమించేందుకే 2డీజీ డ్రగ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు సతీష్‌రెడ్డి. సొంతంగా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లను సిద్ధం చేసి వాటిని వివిధ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తోంది. దీనికి పీఎం కేర్స్‌ నుంచి నిధులు కూడా మంజూరు అయినట్టు స్పష్టం చేశారు సతీష్‌ రెడ్డి. వచ్చే మూడు నెలల్లో మొత్తం 500 ఆక్సిజన్ జనరేషన్‌ ప్లాంట్ల ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్‌తో పాటు రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రుల్లో ఇన్‌స్టాల్‌ చేసినట్టు స్పష్టం చేశారు సతీష్‌ రెడ్డి.