కంగ‌నా రనౌత్‌కు క‌రోనా

విధాత‌(ముంబై): బాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ క‌థానాయిక కంగ‌నా ర‌నౌత్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. గ‌త కొన్ని రోజులుగా స్వ‌ల్పంగా అస్వ‌స్థ‌త‌, క‌ళ్ల‌లో మంట‌గా అనిపిస్తుండ‌టంతో శుక్ర‌వారం ఆమె క‌రోనా నిర్ధార‌న ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. శ‌నివారం ఉద‌యం వెల్ల‌డైన ఆ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో కంగనా ర‌నౌత్‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విష‌యాన్ని ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించారు. క‌రోనా సోక‌డంతో నేను సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉన్నా. క‌రోనా వైర‌స్ నా శ‌రీంలో పార్టీ చేసుకుంటున్న‌దే విష‌యం […]

కంగ‌నా రనౌత్‌కు క‌రోనా

విధాత‌(ముంబై): బాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ క‌థానాయిక కంగ‌నా ర‌నౌత్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. గ‌త కొన్ని రోజులుగా స్వ‌ల్పంగా అస్వ‌స్థ‌త‌, క‌ళ్ల‌లో మంట‌గా అనిపిస్తుండ‌టంతో శుక్ర‌వారం ఆమె క‌రోనా నిర్ధార‌న ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. శ‌నివారం ఉద‌యం వెల్ల‌డైన ఆ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో కంగనా ర‌నౌత్‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విష‌యాన్ని ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించారు.

క‌రోనా సోక‌డంతో నేను సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉన్నా. క‌రోనా వైర‌స్ నా శ‌రీంలో పార్టీ చేసుకుంటున్న‌దే విష‌యం నాకు ఇప్ప‌టిదాకా తెలియ‌దు. ఇప్పుడు తెలిసిందిగా ఇక దాన్ని అంతం చేస్తా. మీరు కూడా దేనికి మీపై అజమాయిషీ చేసే అవ‌కాశం ఇవ్వొద్దు. మీరు క‌రోనాకు భ‌య‌ప‌డ్డారంటే అది మిమ్మ‌ల్ని మ‌రింత భ‌య‌పెడుతుంది. క‌రోనా వైర‌స్ కూడా ఒక చిన్న ఫ్లూ లాంటిదే. కొంచెం ఇబ్బంది పెట్టినా అదే త‌గ్గిపోతుంది. హ‌ర్ హ‌ర్ మ‌హ‌దేవ్ అని కంగనా త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.