ఈనెల 5 న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న దీదీ

టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. సోమవారం తృణమూల్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే మమతను శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఈ నెల 5 న ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేస్తారని తృణమూల్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని అత్యంత సాధారణంగానే జరుపుతామని ప్రకటించారు. కరోనాను కట్టడి చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని, దానిని కట్టడి చేసేంత వరకూ […]

ఈనెల 5 న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న దీదీ

టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. సోమవారం తృణమూల్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే మమతను శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఈ నెల 5 న ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేస్తారని తృణమూల్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు.

అయితే ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని అత్యంత సాధారణంగానే జరుపుతామని ప్రకటించారు. కరోనాను కట్టడి చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని, దానిని కట్టడి చేసేంత వరకూ ఎలాంటి ఉత్సవాలూ జరపమని టీఎంసీ పేర్కొంది.