తిరుమల శ్రీవారి లడ్డూకు 306వ పుట్టిన రోజు శుభాకాంక్షలు

విధాత:కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు పరమపవిత్రం, స్వామి వారి లడ్డూ కోసం భక్తులు ఎగబడుతుంటారు, తిరుమలకు వెళ్లిన క్రమంలో ఇంకా కొన్ని లడ్డూలు దొరికితే బాగుండు అనుకునే భక్తులు చాలామందే ఉంటారు. స్వామివారి లడ్డూ ప్రసాదం లేకపోతే తిరుమల తిరుపతి తీర్థయాత్ర చేసినట్టే కాదని మరికొందరు భావిస్తారు. చక్కెర, శనగపిండి, నెయ్యి, ఆయిల్, యాలకులు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే […]

తిరుమల శ్రీవారి లడ్డూకు 306వ పుట్టిన రోజు శుభాకాంక్షలు

విధాత:కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు పరమపవిత్రం, స్వామి వారి లడ్డూ కోసం భక్తులు ఎగబడుతుంటారు, తిరుమలకు వెళ్లిన క్రమంలో ఇంకా కొన్ని లడ్డూలు దొరికితే బాగుండు అనుకునే భక్తులు చాలామందే ఉంటారు. స్వామివారి లడ్డూ ప్రసాదం లేకపోతే తిరుమల తిరుపతి తీర్థయాత్ర చేసినట్టే కాదని మరికొందరు భావిస్తారు.

చక్కెర, శనగపిండి, నెయ్యి, ఆయిల్, యాలకులు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. రకరకాలైన ప్రసాదాలను టీటీడీ అందుబాటులో ఉంచినప్పటికీ భక్తులకు లడ్డూ అంటేనే అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది. ప్రసాదాల విక్రయం ద్వారా టీటీడీకి ఏటా కోట్ల ఆదాయం సమకూరుతోంది. శ్రీవారి ప్రసాదంగా లడ్డూను ఇవ్వడం 1715 ఆగస్టులో ప్రారంభమైందని అంటారు…

శ్రీవారి లడ్డూకు జీఐఎస్ రోజుకు మూడు లక్షలకు పైగా లడ్డూలు తయారు చేయగల సామర్థ్యం టీటీడీ సొంతం, బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు మరింత ఎక్కువగా లడ్డూలను అందుబాటులో ఉంచుతారు టీటీడీ అధికారులు, నిత్యం వందలాది మంది లడ్డూ ప్రసాదం తయారీలో నిమగ్నమై ఉంటారు, తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం వినియోగించే కిచెన్‌ను ఆధునిక హంగులు ఏర్పాటు చేశారు, బూందీ క్రేట్స్‌తో పాటు లడ్డూలను మోసుకుపోయేందుకు ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేశారు, తిరుపతి లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండటం విశేషం, అంతేకాదు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్ట్రార్ 2014వ సంవత్సరంలో ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్’ కూడా ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం 306 సంవత్సరాల కిందటే మొదలైందని, స్వామి వారి లడ్డు పుట్టినరోజు 1715, ఆగస్టు 2 అని, ఆ క్రమంలో ఇవాళ 306వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని, దాంతో శ్రీవారి లడ్డూకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తిరుమల భక్తులు.