గౌరవ ప్రధానమంత్రి గారు.. ఏమిటండీ మాకీ బాధలు? మమతా బెనర్జీ

విధాత:గౌరవ ప్రధానమంత్రి గారు… మీరంటే మాకెంతో గౌరవం ఉంది. కానీ ఏమిటండీ మాకీ బాధలు? మమ్మల్ని అనేక విధాలుగా అవమానిస్తున్నారు? కరోనా కాలంలో 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. కరోనా మీటింగ్ కు నన్ను ఆహ్వానించారు. కానీ, మాట్లాడడానికి అనుమతించ లేదు. నేతాజీ సభలో మీ ముందే నాకు అవమానం జరిగేలా చేశారు. ఎన్నికల పేర మా రాష్ట్రాన్ని రాజకీయ రణరంగంగా మార్చారు. ఐనా భారీ ప్రజామోదంతో, ప్రజాస్వామ్యబద్దంగా గెలిచాం. దాన్ని మీరు జీర్ణించుకోలేక పోతున్నారు. అప్పటి […]

గౌరవ ప్రధానమంత్రి గారు.. ఏమిటండీ మాకీ బాధలు? మమతా బెనర్జీ

విధాత:గౌరవ ప్రధానమంత్రి గారు… మీరంటే మాకెంతో గౌరవం ఉంది. కానీ ఏమిటండీ మాకీ బాధలు? మమ్మల్ని అనేక విధాలుగా అవమానిస్తున్నారు? కరోనా కాలంలో 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. కరోనా మీటింగ్ కు నన్ను ఆహ్వానించారు. కానీ, మాట్లాడడానికి అనుమతించ లేదు. నేతాజీ సభలో మీ ముందే నాకు అవమానం జరిగేలా చేశారు. ఎన్నికల పేర మా రాష్ట్రాన్ని రాజకీయ రణరంగంగా మార్చారు.

ఐనా భారీ ప్రజామోదంతో, ప్రజాస్వామ్యబద్దంగా గెలిచాం. దాన్ని మీరు జీర్ణించుకోలేక పోతున్నారు. అప్పటి నుంచి (ఎన్నికల అనంతరం) మా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. స్వయంగా మా రాష్ట్ర గవర్నరే, అలర్లు జరిగిన ప్రాంతాలలో పర్యటించారు. ఆ విధంగా అల్లర్లకు ఆజ్యం పోసారు. ఇపుడు మా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వెన్నక్కి పంపమంటున్నారు. ఆయన్ను కేంద్రమే మాకు కేటాయించ ఉండి ఉండవచ్చ. కానీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారి. అసలే కరోనాతో బెంగాల్ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాదు, వరద ధాటికి బెంగాల్ అతలాకుతలం అవుతోంది. పరిపాలన అస్థవ్యస్థమౌతోంది. బెంగాల్ అభివృద్ధి కోసం, మా ప్రజల క్షేమం కోసం మీ కాళ్ళు పట్టుకుంటాను. మమ్మిల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టకుండి. అవమానాల పాలు చేయకండి.