బొమ్మను చూసి అమ్మ అనుకుని.. కిలోమీటర్ల కొద్ది పరిగెత్తిన గుర్రం( Video)

విధాత: ఓ పిల్ల గుర్రం ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. కోయంబత్తూర్ సెల్వపురంలో ఓ ప్రైవేటు బస్సుపై పరుగెడుతున్న గుర్రం పెయింటింగ్ ఉన్నది. ఆ పెయింటింగ్‌లో ఉన్న గుర్రాన్ని చూసి తన తల్లి అనుకొని బస్సు స్టార్ట్ కాగానే దాని అనుసరిస్తూ.. కిలో మీటర్ల దూరం పరుగెత్తింది. ఆ ఘటన జనాల, ప్రయాణికుల హృదయాలను కదిలించింది. ఆ మూగ జీవానికి తన తల్లిపై ఉన్న మమకారం ఎంత ఉన్నదో ఈ ఉదంతాన్ని చూస్తే అర్థం అవుతుంది. బొమ్మను చూసి […]

బొమ్మను చూసి అమ్మ అనుకుని.. కిలోమీటర్ల కొద్ది పరిగెత్తిన గుర్రం( Video)

విధాత: ఓ పిల్ల గుర్రం ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. కోయంబత్తూర్ సెల్వపురంలో ఓ ప్రైవేటు బస్సుపై పరుగెడుతున్న గుర్రం పెయింటింగ్ ఉన్నది. ఆ పెయింటింగ్‌లో ఉన్న గుర్రాన్ని చూసి తన తల్లి అనుకొని బస్సు స్టార్ట్ కాగానే దాని అనుసరిస్తూ.. కిలో మీటర్ల దూరం పరుగెత్తింది.

ఆ ఘటన జనాల, ప్రయాణికుల హృదయాలను కదిలించింది. ఆ మూగ జీవానికి తన తల్లిపై ఉన్న మమకారం ఎంత ఉన్నదో ఈ ఉదంతాన్ని చూస్తే అర్థం అవుతుంది. బొమ్మను చూసి అమ్మ అనుకుని భ్రమ పడిన ఆ పిల్ల గుర్రం కిలో మీటర్లు పరిగెత్తడం అందర్నీ కంట తడి పెట్టించింది.

వివరాళ్లోకి వెళితే.. కోయంబత్తూరు నగరం నుంచి పరిసర ప్రాంతాలకు వెళ్లే ఒక ప్రైవేట్ బస్సుపై గుర్రం పెయింటింగ్‌ ఉంది. ఆ బస్సు నిన్న కోయంబత్తూరులోని సెల్వపురం ప్రాంతంలోని ఓ థియేటర్ దగ్గర ప్రయాణికుల కోసం ఆగింది. అదే సమయంలో ఆ ప్రాంతంలో తిరుగుతున్న ఒక గుర్రం బస్సుపై ఉన్న గుర్రం పెయింటింగ్‌ను చూసి బస్సుతో పాటు పరిగెత్తింది.

ఒకసారి పెయింటింగ్ గుర్రం ముఖం తాకినట్లు కనిపించింది. ఇది చూసి ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ స్థితిలో బస్సు అక్కడి నుంచి బయల్దేరి వెళ్లే సరికి రోడ్డుపై ఉన్న వ్యక్తులు, బస్సులోని ప్రయాణికులు బస్సు వెనుకే కి.మీల కొద్దీ పరుగెత్తుకు వచ్చిన గుర్రాన్ని ఆసక్తిగా చూశారు. తల్లి కోసం ఆ పిల్ల గుర్రం తాపత్రయాన్ని చూసి చలించి పోయారు.