మరాఠా రిజర్వేషన్లు ర‌ద్దు..సుప్రీం కోర్టు సంచలన తీర్పు

విధాత‌ : మరాఠా రిజర్వేషన్లపై బుధవారం సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలోని మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. ఆర్థిక, సామాజిక వెనుకబాటు తనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయని, 50 శాతానికి రిజర్వేషన్లు మించితే సమానత్వపు హక్కు ఉల్లంఘించినట్టేనని కోర్టు పేర్కొంది. 1992 మండల్‌ తీర్పులో సుప్రీంకోర్టు విధించిన రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని పునః సమీక్షించాల్సిన అవసరం […]

మరాఠా రిజర్వేషన్లు ర‌ద్దు..సుప్రీం కోర్టు సంచలన తీర్పు

విధాత‌ : మరాఠా రిజర్వేషన్లపై బుధవారం సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలోని మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. ఆర్థిక, సామాజిక వెనుకబాటు తనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయని, 50 శాతానికి రిజర్వేషన్లు మించితే సమానత్వపు హక్కు ఉల్లంఘించినట్టేనని కోర్టు పేర్కొంది.

1992 మండల్‌ తీర్పులో సుప్రీంకోర్టు విధించిన రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని పునః సమీక్షించాల్సిన అవసరం లేదని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, పీజీ మెడికల్‌ కోర్సుల్లో కొత్త రిజర్వేషన్ల చట్టం మేరకు ఇప్పటికే చేపట్టిన ప్రవేశాలు కొనసాగుతాయని తెలిపింది. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది.