తిరుమ‌ల‌లో భారీగా త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ

విధాత‌(తిరుమ‌ల) : క‌రోనా ఉధృతి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం విధించిన క‌ర్ఫ్యూ ప్ర‌భావం తిరుమ‌ల‌పై ప‌డింది. తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల సంఖ్య భారీగా త‌గ్గింది. ఇప్ప‌టికే స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు నిలిపివేసిన టీటీడీ.. కేవ‌లం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు మాత్ర‌మే శ్రీవారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తోంది. మంగ‌ళ‌వారం కేవ‌లం 4,700 మంది భ‌క్తులు మాత్ర‌మే శ్రీవారిని ద‌ర్శించుకోగా, ఏప్రిల్ నెల‌లో శ్రీవారిని 9 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే ద‌ర్శించుకున్నారు. మార్చి నెల‌లో 16 ల‌క్ష‌ల మంది ద‌ర్శించుకున్న‌ట్లు టీటీడీ తెలిపింది. […]

తిరుమ‌ల‌లో భారీగా త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ

విధాత‌(తిరుమ‌ల) : క‌రోనా ఉధృతి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం విధించిన క‌ర్ఫ్యూ ప్ర‌భావం తిరుమ‌ల‌పై ప‌డింది. తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల సంఖ్య భారీగా త‌గ్గింది. ఇప్ప‌టికే స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు నిలిపివేసిన టీటీడీ.. కేవ‌లం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు మాత్ర‌మే శ్రీవారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తోంది.

మంగ‌ళ‌వారం కేవ‌లం 4,700 మంది భ‌క్తులు మాత్ర‌మే శ్రీవారిని ద‌ర్శించుకోగా, ఏప్రిల్ నెల‌లో శ్రీవారిని 9 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే ద‌ర్శించుకున్నారు. మార్చి నెల‌లో 16 ల‌క్ష‌ల మంది ద‌ర్శించుకున్న‌ట్లు టీటీడీ తెలిపింది. క‌రోనా భ‌యంతో భ‌క్తులెవ‌రూ తిరుమ‌ల‌కు రావ‌డం లేదు. ఇక ప‌గ‌టి క‌ర్ఫ్యూ కూడా విధించ‌డంతో తిరుమ‌ల‌కు భ‌క్తుల సంఖ్య త‌గ్గింద‌ని చెప్పొచ్చు. ప్ర‌జా, ప్ర‌యివేటు ర‌వాణాను కేవ‌లం ఉద‌యం 6 నుంచి 12 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తిస్తున్నారు. దీంతో భ‌క్తుల రాక‌పోక‌ల‌కు కూడా అంత‌రాయం ఏర్ప‌డింద‌ని చెప్పొచ్చు.