గుజరాత్లో ఐదో తరగతి పాసైన ఓ భాజపా ఎమ్మెల్యే కరోనా రోగికి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ఇవ్వటం వివాదాస్పదమైంది.ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సూరత్‌లోని సర్తానా ప్రాంతంలో భాజపా నేతలు నెలకొల్పిన ఓ ఐసోలేషన్ కేంద్రంలో కరోనా రోగికి ఇంజెక్షన్ వేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించారు కామ్రాజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీడీ ఝలవాడియా.అయితే.. తాను ఇంజెక్షన్ వేయలేదని మిక్స్ మాత్రమే చేశానని ఎమ్మెల్యే అన్నారు. డాక్టర్ డిగ్రీ లేకపోయినా.. వైద్యునిలా ఝలవాడియా వ్యవహరించారని గ్రెస్ […]
గుజరాత్లో ఐదో తరగతి పాసైన ఓ భాజపా ఎమ్మెల్యే కరోనా రోగికి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ఇవ్వటం వివాదాస్పదమైంది.ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
సూరత్‌లోని సర్తానా ప్రాంతంలో భాజపా నేతలు నెలకొల్పిన ఓ ఐసోలేషన్ కేంద్రంలో కరోనా రోగికి ఇంజెక్షన్ వేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించారు కామ్రాజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీడీ ఝలవాడియా.అయితే.. తాను ఇంజెక్షన్ వేయలేదని మిక్స్ మాత్రమే చేశానని ఎమ్మెల్యే అన్నారు.
డాక్టర్ డిగ్రీ లేకపోయినా.. వైద్యునిలా ఝలవాడియా వ్యవహరించారని గ్రెస్ నేత సురేష్ సోనావానే విమర్శించారు.రోగులకు ఇంజెక్షన్ వేస్తూ ఫొటో సెషన్ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
ఈ విధంగా ఝలవాడియా.. చీప్ పబ్లిసిటీ కోసం యత్నించారని దుయ్యబట్టారు.