నేషనల్ అవార్డ్ గ్రహీత కన్నుమూత

కరోనాతో అనేక మంది ప్ర‌ముఖులు క‌న్నుమూస్తున్నారు. వారి మ‌ర‌ణంతో సినీ ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి చెందుతుంది. తాజాగా క‌రోనా కార‌ణంగా మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, రచయిత మదంపు కుంజుకుట్టన్(81) కోవిడ్‌-19 బారినపడి తుదిశ్వాస విడిచారు. 1978లో అశ్వద్ధామ అనే సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. 2000లో విడుదలైన ‘కరుణమ్’ అనే సినిమాకు ఆయన ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా నేషనల్ అవార్డు అందుకున్నారు.కుంజుకుట్టన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తీవ్ర జ్వ‌రంతో కుంజుకుట్ట‌న్ త్రిశూర్‌లోని […]

నేషనల్ అవార్డ్ గ్రహీత కన్నుమూత

కరోనాతో అనేక మంది ప్ర‌ముఖులు క‌న్నుమూస్తున్నారు. వారి మ‌ర‌ణంతో సినీ ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి చెందుతుంది. తాజాగా క‌రోనా కార‌ణంగా మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, రచయిత మదంపు కుంజుకుట్టన్(81) కోవిడ్‌-19 బారినపడి తుదిశ్వాస విడిచారు. 1978లో అశ్వద్ధామ అనే సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. 2000లో విడుదలైన ‘కరుణమ్’ అనే సినిమాకు ఆయన ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా నేషనల్ అవార్డు అందుకున్నారు.కుంజుకుట్టన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తీవ్ర జ్వ‌రంతో కుంజుకుట్ట‌న్ త్రిశూర్‌లోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో అడ్మిట్ కాగా, ఆయ‌నకు ప‌రీక్ష‌లు జ‌రిపిన వైద్యులు క‌రోనా అని తేల్చారు. కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం క‌న్నుమూసారు. డైరెక్టర్‌, స్క్రిప్ట్‌ రైటర్‌ డెన్నిస్‌ జోసెఫ్‌ మరణించిన 24గంటల్లోనే కుంజుకుట్టన్‌ కన్నుమూయడం మలయాళ సినీ పరిశ్రమని తీవ్ర ఆవేదనలోకి నెట్టింది. ఈయ‌న 2001లో బీజేపీ తరఫున కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు .