కొత్తకేసులు 3.68లక్షలు.. మరణాలు 3417

దేశంలో కరోనా విలయతాండం కొనసాగుతూనే ఉంది. విచ్చలవిడిగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌కు నిత్యం వేల మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ప్రతి రోజూ లక్షల మందిపై ప్రతాపం చూపుతూ వికటాట్టహాసం చేస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 3.68లక్షల మంది కొవిడ్‌ బారిన పడ్డారు. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయితే, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. […]

కొత్తకేసులు 3.68లక్షలు.. మరణాలు 3417

దేశంలో కరోనా విలయతాండం కొనసాగుతూనే ఉంది. విచ్చలవిడిగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌కు నిత్యం వేల మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ప్రతి రోజూ లక్షల మందిపై ప్రతాపం చూపుతూ వికటాట్టహాసం చేస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 3.68లక్షల మంది కొవిడ్‌ బారిన పడ్డారు. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయితే, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.

  • ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 15,04,698 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 3,68,147 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.99కోట్లకు చేరింది.
  • ఇదే సమయంలో వైరస్‌ నుంచి కోలుకునేవారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతుండటం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 3,00,732 మంది కొవిడ్‌ను జయించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 1.62కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 81.77శాతంగా ఉంది.
  • మరణాల సంఖ్య మరోసారి 3వేలకు పైనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 3,417 మంది కొవిడ్ వల్ల మృత్యువాతపడ్డారు. మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 2,18,959 మంది వైరస్‌కు బలైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
  • కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసులు 34లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34,13,642 యాక్టివ్‌ కేసులుండగా.. క్రియాశీల రేటు 17.13శాతానికి చేరింది.

నెమ్మదిగా వ్యాక్సినేషన్‌..

ఇక దేశంలో టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెనమ్మదిగా సాగుతోంది. చాలా చోట్ల టీకాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం కేవలం 12లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వగా.. ఇప్పటి వరకు 15.71కోట్ల మంది టీకాలు తీసుకున్నారు.