జమ్మూకశ్మీర్‌ను జల్లెడపడుతున్న ఎన్‌ఐఏ..
విధాత: జమ్మూకశ్మీర్‌వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 14 జిల్లాల్లోని 45 ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టింది. ఉగ్రవాదులకు నిధుల చేరవేతకు సంబంధించిన ఓ కేసు నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. నిషేధిత జమాతే ఇస్లామీ సభ్యుల నివాసాలే లక్ష్యంగా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దిల్లీ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఎన్‌ఐఏ బృందం ఈ సోదాలు నిర్వహిస్తోంది. వీరికి జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బృందాలు సహకరిస్తున్నాయి. దోడా, కిష్టావర్, […]

విధాత: జమ్మూకశ్మీర్‌వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 14 జిల్లాల్లోని 45 ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టింది. ఉగ్రవాదులకు నిధుల చేరవేతకు సంబంధించిన ఓ కేసు నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. నిషేధిత జమాతే ఇస్లామీ సభ్యుల నివాసాలే లక్ష్యంగా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
దిల్లీ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఎన్‌ఐఏ బృందం ఈ సోదాలు నిర్వహిస్తోంది. వీరికి జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బృందాలు సహకరిస్తున్నాయి. దోడా, కిష్టావర్, రంబన్, అనంత్‌నాగ్, బద్గాం, రజౌరీ, షోపియాన్ సహా మరికొన్ని జిల్లాల్లోని అనుమానితుల నివాసాల్లో దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పలు కీలక పత్రాలతో పాటు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పాకిస్థాన్ అనుకూల కార్యక్రమాల చేపడుతూ దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్న జమాతే.. పలు ఉగ్రవాద కార్యక్రలాపాలకు నిధులు సమకూర్చుతున్నట్లు ఇటీవల నమోదైన ఓ కేసులో బహిర్గతమైంది. గతవారం కూడా ఎన్‌ఐఏ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది.