కుక్క దాహాన్ని తీర్చిన పోలీస్

మండుటెండ‌ల‌కు ఓ శున‌కానికి దాహం బాగా వేసింది. దీంతో ఆ కుక్క ఓ హ్యాండ్ పంప్ వ‌ద్ద‌కు వ‌చ్చి నిల‌బ‌డింది. నీళ్ల కోసం అటుఇటు తిరుగుతూ ఉంది. ఈ విష‌యాన్ని అక్క‌డున్న ఓ పోలీసు కానిస్టేబుల్ గ‌మ‌నించాడు. ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా హ్యాండ్ పంప్‌ను పోలీసు త‌న చేత్తో పంపు చేయ‌గా.. వ‌చ్చిన నీటితో శున‌కం త‌న దాహాన్ని తీర్చుకుంది. ఈ ఫోటోను వార‌ణాసికి చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ సుకృతి మాధ‌వ్ మిశ్రా త‌న ట్విట్ట‌ర్ […]

కుక్క దాహాన్ని తీర్చిన పోలీస్

మండుటెండ‌ల‌కు ఓ శున‌కానికి దాహం బాగా వేసింది. దీంతో ఆ కుక్క ఓ హ్యాండ్ పంప్ వ‌ద్ద‌కు వ‌చ్చి నిల‌బ‌డింది. నీళ్ల కోసం అటుఇటు తిరుగుతూ ఉంది. ఈ విష‌యాన్ని అక్క‌డున్న ఓ పోలీసు కానిస్టేబుల్ గ‌మ‌నించాడు.

ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా హ్యాండ్ పంప్‌ను పోలీసు త‌న చేత్తో పంపు చేయ‌గా.. వ‌చ్చిన నీటితో శున‌కం త‌న దాహాన్ని తీర్చుకుంది. ఈ ఫోటోను వార‌ణాసికి చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ సుకృతి మాధ‌వ్ మిశ్రా త‌న ట్విట్ట‌ర్ పేజీలో పోస్టు చేశారు. కుక్కు దాహాన్ని తీర్చిన పోలీసుపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.