మే 18 నుండి 26వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయం లోపల ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు మే 17వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. వాహనసేవల వివరాలు : 18-05-2021(మంగళవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం 19-05-2021(బుధవారం) చిన్నశేష వాహనం హంస వాహనం 20-05-2021(గురువారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం 21-05-2021(శుక్రవారం) […]

టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయం లోపల ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు మే 17వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు.

మే 18వ తేదీ మంగళవారం ఉదయం 7.55 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
18-05-2021(మంగళవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం
19-05-2021(బుధవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
20-05-2021(గురువారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
21-05-2021(శుక్రవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
22-05-2021(శనివారం) మోహినీ అవతారం గరుడ వాహనం
23-05-2021(ఆదివారం) హనుమంత వాహనం వసంతోత్సవం, గజ వాహనం
24-05-2021(సోమవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
25-05-2021(మంగళవారం) రథోత్సవం అశ్వవాహనం
26-05-2021(బుధవారం) చక్రస్నానం ధ్వజావరోహణం