భారత ప్రయాణికులపై శ్రీలంక నిషేధం

విధాత‌(కొలంబో) : దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండ‌డంతో భారత్‌పై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే బ్రిటన్‌, కెనడా, యూఏఈ, అమెరికా, ఇజ్రాయిల్‌ ప్రయాణాలపై నిషేధం విధించగా.. శ్రీలంక సైతం అదే బాట పట్టింది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులు ఆ దేశంలో దిగేందుకు అనుమతి ఇవ్వమని సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ బుధవారం తెలిపింది. నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది. భారత్‌లో కరోనా వేగవంగా వ్యాప్తి చెందుతుండడంతోనే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అనేక […]

భారత ప్రయాణికులపై శ్రీలంక నిషేధం

విధాత‌(కొలంబో) : దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండ‌డంతో భారత్‌పై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే బ్రిటన్‌, కెనడా, యూఏఈ, అమెరికా, ఇజ్రాయిల్‌ ప్రయాణాలపై నిషేధం విధించగా.. శ్రీలంక సైతం అదే బాట పట్టింది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులు ఆ దేశంలో దిగేందుకు అనుమతి ఇవ్వమని సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ బుధవారం తెలిపింది.

నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది. భారత్‌లో కరోనా వేగవంగా వ్యాప్తి చెందుతుండడంతోనే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అనేక దేశాలు భారత్‌తో పాటు శ్రీలంక, ఇతర దక్షిణాసియా దేశాల ప్రయాణికులపై బ్యాన్‌ విధించాయి. శ్రీలంకకు చేరుకున్న భారత ప్రయాణికులపై గతవారం ఆంక్షలు విధించారు.

పర్యాటక శాఖ మంత్రి ప్రసన్న రణతుంగ మాట్లాడుతూ భారత పర్యాటకులు శ్రీలంకను ట్రావెల్‌ బబుల్‌లో సందర్శిస్తారని చెప్పారు. కరోనా సంక్షోభం నుంచి శ్రీలంకను సందర్శించే భారతీయుల సంఖ్య తగ్గిందని తెలిపారు. భారతీయులను ప్రత్యేక హోటళ్లలో ఉంచారని, ఇతర పర్యాటకులతో ఎలాంటి సంబంధం లేదని మంత్రి చెప్పారు.

ఆరోగ్య అధికారులు అభ్యర్థన చేస్తే తప్పా విమానాశ్రయాలను మూసివేయడం, శ్రీలంకకు వచ్చే వారి సంఖ్యను తగ్గించడంపై నిర్ణయం తీసుకుంటామని ప్రసన్న రణతుంగ పేర్కొన్నారు. అయితే విమానాశ్రయాన్ని వెంటనే మూసివేయడం సాధ్యం కాదని, దీంతో దేశానికి తిరిగి వచ్చే లంక ప్రజలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. శ్రీలంక వలస కార్మికులను దేశానికి తిరిగి వచ్చేలా అధ్యక్షుడు గోటబయ రాజపక్స సూచనలు జారీ చేసినట్లు వివరించారు.