34 మందితో కొలువుదీర‌నున్న స్టాలిన్ క్యాబినెట్‌

ధాత‌(చెన్నై): డీఎంకే అధ్య‌క్షుడు, త‌మిళ‌నాడుకు కాబోయే ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా త‌న నూత‌న క్యాబినెట్‌ను కొలువుదీర్చారు. ఈ మేర‌కు 34 మంది పేర్ల‌తో జాబితా వెల్ల‌డించారు. ఆ జాబితాలో ఎవ‌రెవ‌రికీ ఏ మంత్రిత్వ శాఖను కేటాయిస్తున్నారో కూడా స్టాలిన్ స్ప‌ష్టంచేశారు. ఈ 34 మంది కాబోయే మంత్రుల పేర్ల‌తో కూడిన జాబితాకు త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రిలాల్ పురోహిత్ కూడా ఆమోదం తెలిపారు. కొత్త జాబితాలోని వివ‌రాల ప్రకారం.. […]

34 మందితో కొలువుదీర‌నున్న స్టాలిన్ క్యాబినెట్‌

ధాత‌(చెన్నై): డీఎంకే అధ్య‌క్షుడు, త‌మిళ‌నాడుకు కాబోయే ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా త‌న నూత‌న క్యాబినెట్‌ను కొలువుదీర్చారు. ఈ మేర‌కు 34 మంది పేర్ల‌తో జాబితా వెల్ల‌డించారు. ఆ జాబితాలో ఎవ‌రెవ‌రికీ ఏ మంత్రిత్వ శాఖను కేటాయిస్తున్నారో కూడా స్టాలిన్ స్ప‌ష్టంచేశారు.

ఈ 34 మంది కాబోయే మంత్రుల పేర్ల‌తో కూడిన జాబితాకు త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రిలాల్ పురోహిత్ కూడా ఆమోదం తెలిపారు. కొత్త జాబితాలోని వివ‌రాల ప్రకారం.. సీనియ‌ర్ నాయ‌కుడు సుబ్ర‌మ‌ణ్యానికి ఆరోగ్య‌శాఖ‌, మ‌రో సీనియ‌ర్ నేత దురై మురుగ‌న్‌కు నీటిపారుద‌ల శాఖ కేటాయించిన‌ట్లు స‌మాచారం. రేపు ఉద‌యం రాజ్‌భ‌వ‌న్‌లో స్టాలిన్ ముఖ్య‌మంత్రిగా, ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు మంత్రులుగా ప్ర‌మాణం చేయ‌నున్నారు.