ఎగుమతి ప‌న్ను ఎగవేతపై కేంద్రం స్పందనకు ఆదేశం

ఇనుప ఖనిజం ఎగుమతులు చేసే 61 సంస్థలు 2015 నుంచి ప‌న్ను ఎగవేతకు పాల్పడ్డాయని, దానిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం పరిశీలించింది. దీనిపై రెండు వారాల్లో స్పందన తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 30% ఎగుమతి ప‌న్ను చెల్లించకుండానే ఈ సంస్థలన్నీ చైనాకు అక్రమంగా ఖనిజాన్ని చేరవేస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. అభియోగం నిజమైతే అది తీవ్ర విషయమేనని […]

ఎగుమతి ప‌న్ను ఎగవేతపై కేంద్రం స్పందనకు ఆదేశం

ఇనుప ఖనిజం ఎగుమతులు చేసే 61 సంస్థలు 2015 నుంచి ప‌న్ను ఎగవేతకు పాల్పడ్డాయని, దానిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం పరిశీలించింది. దీనిపై రెండు వారాల్లో స్పందన తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 30% ఎగుమతి ప‌న్ను చెల్లించకుండానే ఈ సంస్థలన్నీ చైనాకు అక్రమంగా ఖనిజాన్ని చేరవేస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. అభియోగం నిజమైతే అది తీవ్ర విషయమేనని ధర్మాసనం పేర్కొంది.