కొవిడ్-19 మృతులకు పరిహారం చెల్లించాల్సిందే
విధాత:కొవిడ్-19 మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బుధవారం సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడానికి ఆరు వారాల గడువు విధించింది. ఎంత మొత్తం అందించాలనే నిర్ణయాన్ని మాత్రం ప్రభుత్వానికే వదిలేసింది. కొవిడ్ కారణంగా మరణించిన ప్రతిఒక్కరికి రూ.4లక్షలు చెల్లించలేమని కొద్ది రోజుల క్రితం కేంద్రం కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. అలా ఇవ్వాల్సి వస్తే విపత్తు సహాయ నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుందని తెలిపింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు విపత్తు సహాయం కింద […]

విధాత:కొవిడ్-19 మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బుధవారం సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడానికి ఆరు వారాల గడువు విధించింది. ఎంత మొత్తం అందించాలనే నిర్ణయాన్ని మాత్రం ప్రభుత్వానికే వదిలేసింది. కొవిడ్ కారణంగా మరణించిన ప్రతిఒక్కరికి రూ.4లక్షలు చెల్లించలేమని కొద్ది రోజుల క్రితం కేంద్రం కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. అలా ఇవ్వాల్సి వస్తే విపత్తు సహాయ నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుందని తెలిపింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు విపత్తు సహాయం కింద పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరుగుతోంది.