New York: నదిలో.. కుప్పకూలిన హెలికాప్టర్! ఆరుగురు మృతి

  • By: sr    videos    Apr 11, 2025 2:18 PM IST
New York: నదిలో.. కుప్పకూలిన హెలికాప్టర్! ఆరుగురు మృతి

విధాత : న్యూయార్క్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉన్నట్టుండి స్థానిక హడ్సన్ నదిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన‌ట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో స్పెయిన్‌ దేశానికి చెందిన సిమెన్స్ టెక్‌ కంపెనీ సీఈఓ అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు దుర్మరణం చెందారని వెల్లడించారు.

దుర్ఘటనలో పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో ఆకాశం దట్టమైన మేఘావృతమై కనిపించింది. ప్రమాదంలో హెలికాప్టర్ గింగిరాలు తిరుగుతూ నదిలో తలకిందులుగా పడిపోయింది. అనంతరం మంటలు చెలరేగాయి. పూర్తి వివరాలు తెలియాల్సింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది.