Baby flight viral video | ఆకాశంలో చిన్నారి తొలి ప్రయాణం: పైలట్‌కు మధుర క్షణం
ఇండిగో పైలట్ కెప్టెన్ వాకర్ తన 18 నెలల చిన్నారి కూతురు రుబానీని తొలిసారి విమానంలో తీసుకెళ్లిన మధుర క్షణం నెటిజన్లను కట్టిపడేసింది.

Cutest Passenger Ever’: IndiGo Pilot’s Special Announcement for His Little Daughter Wins Hearts
హైదరాబాద్, అక్టోబర్ 1: విమాన ప్రయాణం చాలామందికి సర్వసాధారణమే. కానీ, ఓ పైలట్‌కు మాత్రం తనే నడుపుతున్న విమాన ప్రయాణం మాత్రం జీవితకాలపు మధురానుభూతిని మిగిల్చింది. అదే.. తన 18 నెలల చిన్నారి కూతురిని, భార్యను తొలిసారి తనతో పాటు విమానంలో తీసుకెళ్లిన క్షణం. కెప్టెన్ వాకర్‌గా ఇన్‌స్టాలో పిలువబడే ఓ ఇండిగో విమానయాస సంస్థ పైలట్, తన జీవితంలోని అతి మధురమైన క్షణాన్ని ప్రయాణికులతో పంచుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హృదయాలను గెల్చుకుంది.
విమానంలో మనసును కదిలించే ప్రకటన
విమానం ఢిల్లీ వైపు బయల్దేరే సమయంలో, పైలట్ మైక్‌లో ప్రయాణికులను ఉద్దేశించి, “లేడీస్ అండ్ జెంటిల్మెన్.. ఒక నిమిషం మీ సమయం తీసుకుంటాను. ఈ విమాన ప్రయాణం నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, నా భార్య, నా 18 నెలల కూతురు రుబానీ తొలిసారి నాతో పాటు ప్రయాణిస్తున్నారు” అని ఆనందభాష్పాలతో ప్రకటించారు. ఈ మాటలు విన్న వెంటనే కేబిన్ అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ప్రయాణికులందరూ చిరునవ్వులతో ఆ చిన్నారికి స్వాగతం పలికారు. కెప్టెన్ వాకర్ తన కుటుంబం వైపు చూపిస్తూ చిన్నారి రుబానీని, భార్యను పరిచయం చేశారు.
చిన్నారి రుబానీ చిరునవ్వు – అందరి హృదయాలు గెలిచింది
విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత, రుబానీ తన తండ్రి ఒడిలో కూర్చుని ప్రయాణికులకు టాటా వీడ్కోలు పలికడం ప్రయాణీకులందరి మదిలో ఆనందాన్ని నింపింది. ఆ చిన్నారి చిరునవ్వు, తండ్రి ఆనందం చూసి ప్రయాణికుల కళ్ళల్లో కూడా వెలుగొచ్చింది. అది ఒక విమానయానం కాదు, అంబరాన మెరిసిన ఆనందం.
సోషల్ మీడియాలో వైరల్
View this post on Instagram
ఈ సన్నివేశాన్ని కెప్టెన్ వాకర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో “Flew with the cutest passenger ever” అనే వ్యాఖ్యతో షేర్ చేశారు. క్షణాల్లోనే వీడియో వైరల్ అయి, వందలాది కామెంట్లు, వేలాదిగా షేర్స్ వచ్చాయి. “మీ కుటుంబాన్ని విమానంలో తీసుకెళ్లడంలో మీ ఆనందం మాకు అర్థం కాకపోవచ్చు, కానీ మీ కుటుంబం గర్వపడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం” అని ఒక నెటిజన్ రాశాడు. మరొకరు ఈ క్షణాన్ని కెమెరాలో బంధించిన పైలట్ భార్యను “అదృశ్య నాయిక”గా సంబోధించారు.
ప్రతిరోజూ వృత్తి బాధ్యతల్లో నిమగ్నమై ఉండే పైలట్ జీవితం, ఆకాశంలో ఎన్నో సవాళ్లతో నిండివుంటుంది. కానీ ఆ రోజున, ఒక తండ్రిగా తన కూతురితో గడిపిన ఆ చిన్న క్షణం, తన కుటుంబపు ఆనందం చూసిన ఆ క్షణం అతనికి నిజమైన సంతోషాన్ని ఇచ్చింది. కెప్టెన్ వాకర్, రుబానీ బంధం కేవలం విమానం లోనే కాదు, కింద ఉన్న లక్షలాది హృదయాలను కూడా తాకింది.
ఇలాంటి మధుర క్షణాలు మానవీయ బంధాల విలువను, ప్రేమ శక్తిని ఎల్పప్పుడూ గుర్తు చేస్తాయి.