ఓయబ్బో.. దిల్ రాజులో ఈ టాలెంట్ కూడా ఉందా.. హీరోయిన్‌తో కలిసి రచ్చ చేశాడుగా..!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరిగా ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా ఉంటూనే నిర్మాతగా చిన్న, పెద్ద సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ఏడాది మూవీని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇక దిల్ రాజు నిర్మాతగా ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్స్ గా లవ్ మీ అనే చిత్రం కూడా రూపొందుతుంది. అరుణ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులని అలరించనుంది. మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇటీవల మూవీకి సంబంధించి పోస్టర్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసారు. ఇక తాజాగా మూవీ నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేసారు. ‘రావాలి రా’ అంటూ సాగే మెలోడీని సంగీత ప్రియుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ పాటకి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా చంద్రబోస్ లిరిక్స్ రాసారు. ఇక ఈ పాటని అమల చేబోలు, గోమతి ఐయర్, అదితి భావరాజు, అజ్మల్ ఫాతిమా పర్వీన్, సాయి శ్రేయ సింగర్స్ తో పాటు హీరోయిన్ వైష్ణవి కూడా పాడారు. ఈ పాట పాడడం కోసం కీరవాణి.. వైష్ణవికి వారం పాటు ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ పాటని సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజు, వైష్ణవి కలిసి పాడారు. దిల్ రాజు హమ్ చేయగా వైష్ణవి పాటకి సంబంధించిన పల్లవి పాడింది.
దిల్ రాజు హమ్ చేసిన విధానం చూసి మనోడికి సంగీతం పై మంచి పట్టే ఉందిగా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు మల్టీ టాలెంటెడే అంటున్నారు. గతంలో నాగచైతన్య ‘జోష్’ సినిమాలో ‘అన్నయోచ్చినాడో’ అనే పాటని పాడి అలరించాడు దిల్ రాజు. అయితే సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో వైష్ణవి చిన్న బిట్ మాత్రమే పాడి అలరించగా, మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాత్రం ఫుల్ సాంగ్ పాడుతుందని పేర్కొన్నాడు.ఇ క మూవీలో వైష్ణవి చైతన్యతో పాటు మరో నలుగురు హీరోయిన్స్ గెస్ట్ అపిరెన్స్ కూడా ఉండబోతున్నట్టు కూడా చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఈ హీరోయిన్స్ ఎవరు అన్నది మాత్రం థియేటర్స్ లోనే చూడాలంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.