Viral Video | చికెన్ స్పైసీగా వండ‌లేద‌ని.. భార్య‌ను భ‌వ‌నం పైనుంచి తోసేసిన భ‌ర్త‌..

Viral Video | చికెన్ స్పైసీగా వండ‌లేద‌ని.. భార్య‌ను భ‌వ‌నం పైనుంచి తోసేసిన భ‌ర్త‌..

Viral Video | ఓ మ‌హిళ చికెన్ స్పైసీగా వండ‌లేద‌ని చెప్పి ఆమెను భ‌వ‌నంపై నుంచి కింద‌కు తోసేశాడు భ‌ర్త‌. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్‌లోని లాహోర్‌లో మార్చి 9వ తేదీన చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. లాహోర్ షాలిమార్ రోడ్డులోని నోనారియ‌న్ చౌక్‌కు చెందిన మ‌రియ‌మ్ అనే మ‌హిళ త‌న భ‌ర్త‌, అత్త‌, బావ‌తో క‌లిసి ఉంటోంది. మార్చి 9వ తేదీ రాత్రి మ‌రియ‌మ్ భ‌ర్త చికెన్ తీసుకొచ్చి వండ‌మ‌ని ఆదేశించాడు. ఇక మ‌రియ‌మ్ చికెన్ వండి, కుటుంబ స‌భ్యుల‌కు వ‌డ్డించింది. చికెన్ స్పైసీగా వండ‌లేద‌ని ఆమెపై భ‌ర్త‌, అత్త‌, బావ విరుచుకుప‌డ్డారు. అంత‌టితో ఆగ‌కుండా ఆమెను భ‌వ‌నం పైనుంచి కింద‌కు తోసేశారు. దీంతో ఆవిడ‌కు రెండు కాళ్లు విరిగిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డున్న‌సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

భ‌వ‌నంపై నుంచి కిందప‌డ్డ మ‌రియ‌మ్ అరుపుల‌కు స్థానికులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. బాధితురాలిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితురాలి కాళ్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. మ‌రియ‌మ్ భ‌ర్త‌, అత్త షాజియా, బావ రోమ‌న్‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా.. బాధితురాలి ఇంట్లో నుంచి అరుపులు వినిపించ‌డంతో ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ఓ యువ‌తి అప్ర‌మ‌త్త‌మైంది.త‌న ఇంటి త‌లుపు తెరిచి, పైకి చూసింది. మ‌రియ‌మ్‌ను కింద‌కు తోసే స‌మ‌యంలోనే ఆ యువ‌తి భ‌యంతో త‌లుపు మూసుకున్న‌ట్లు తెలుస్తోంది. అంత‌లోనే మ‌రియ‌మ్‌ను కింద‌కు తోసేశారు. ఆమె నిలువునా కుప్ప‌కూలింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

https://vidhaatha.com/international/woman-thrown-off-building-by-in-laws-allegedly-for-not-spicing-chicken-496693?infinitescroll=1