హిందీ ‘బేబీ’?

గత సంవత్సరం అనామకంగా, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై టాలీవుడ్‌ను షేక్ చేసిన చిత్రం ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ నటించిన ఈ మూవీ చిన్న చిత్రంగా విడుదలై రూ100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి పెద్ద సంచలనమే సృష్టించింది.
ఆ తర్వాత మేకర్స్ ఈ సినిమాను బాలీవుడ్‌లోనూ తెరకెక్కిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హీరో, హీరోయిన్లుగా ఎవరు నటిస్తారనే విషయమైతే ప్రకటించలేదు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మన టాలీవుడ్ బేబమ్మ కృతిశెట్టి, దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బబీల్ ఖాన్ మెయున్‌లీడ్‌గా నటించబోతున్నారంటూ సోషల్‌మీడియాలో వార్త తెగ చక్కర్లు కొడుతుంది.
ALSO READ : మళ్లీ పెళ్లికి సిద్ధమైన నిహారిక?