King Cobra | ఏపీలో 15 అడుగుల నాగుపాము క‌ల‌క‌లం.. రైతుల ప‌రుగులు

King Cobra | అన‌కాప‌ల్లి జిల్లాలో మ‌రో మారు కింగ్ కోబ్రా క‌ల‌క‌లం రేపింది. దేవ‌రాప‌ల్లి మండ‌లం ముకుంద‌పురం స‌మీపంలో వ్య‌వ‌సాయ ప‌నులు చేస్తున్న రైతుల‌కు 15 అడుగుల‌కు పైగా ఉన్న నాగుపాము క‌నిపించింది. దీంతో రైతులంతా తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. బుస‌లు కొడుతున్న ఆ పామును చూసి రైతులు ప‌రుగులు తీశారు. అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. Viral | తాచుపామును మింగిన చేప‌.. క్ష‌ణాల్లోనే రెండూ చ‌నిపోయాయి.. పాము ఉన్న చోటుకు చేరుకున్న అట‌వీశాఖ […]

King Cobra | ఏపీలో 15 అడుగుల నాగుపాము క‌ల‌క‌లం.. రైతుల ప‌రుగులు

King Cobra |

అన‌కాప‌ల్లి జిల్లాలో మ‌రో మారు కింగ్ కోబ్రా క‌ల‌క‌లం రేపింది. దేవ‌రాప‌ల్లి మండ‌లం ముకుంద‌పురం స‌మీపంలో వ్య‌వ‌సాయ ప‌నులు చేస్తున్న రైతుల‌కు 15 అడుగుల‌కు పైగా ఉన్న నాగుపాము క‌నిపించింది.

దీంతో రైతులంతా తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. బుస‌లు కొడుతున్న ఆ పామును చూసి రైతులు ప‌రుగులు తీశారు. అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు.

Viral | తాచుపామును మింగిన చేప‌.. క్ష‌ణాల్లోనే రెండూ చ‌నిపోయాయి..

పాము ఉన్న చోటుకు చేరుకున్న అట‌వీశాఖ అధికారులు, స్నేక్ క్యాచ‌ర్స్ క‌లిసి రెండు గంట‌ల పాటు శ్ర‌మించి, పామును ప‌ట్టుకున్నారు. అనంత‌రం పామును స‌మీప అడ‌వుల్లో వ‌దిలేశారు. దీంతో రైతులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

20 అడుగుల గిరి నాగుపాము.. చూస్తే వ‌ణుకు త‌ప్ప‌దు..

Viral | తాచుపామును మింగిన చేప‌.. క్ష‌ణాల్లోనే రెండూ చ‌నిపోయాయి..