గిరిజన ప్రాంతాలకు ఎఐఎఫ్ ఆపన్న హస్తం

రెండు జిల్లాల్లో 100 పడకల ఆసుపత్రుల ఏర్పాటుకు రూ.8 కోట్లు సాయం ఎపి కొవిడ్ కంట్రోల్ స్పెషలాఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ వెల్లడి విధాత‌: విజయవాడ రాష్ట్రంలోని తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల గిరిజన ప్రాంతాలలోని కోవిడ్ బాధితులకు అమెరికా ఆపన్న హస్తం అందించింది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం, విశాఖపట్నం జిల్లా పాడేరులో 100 పడకల ఆస్పత్రుల ఏర్పాటుకు అమెరికాకు చెందిన అమెరికన్ ఇండియా ఫండ్ (ఎఐఎఫ్) ముందుకొచ్చిందని రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్పెషలాఫీసర్ […]

గిరిజన ప్రాంతాలకు ఎఐఎఫ్ ఆపన్న హస్తం
  • రెండు జిల్లాల్లో 100 పడకల ఆసుపత్రుల ఏర్పాటుకు రూ.8 కోట్లు సాయం
  • ఎపి కొవిడ్ కంట్రోల్ స్పెషలాఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ వెల్లడి

విధాత‌: విజయవాడ రాష్ట్రంలోని తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల గిరిజన ప్రాంతాలలోని కోవిడ్ బాధితులకు అమెరికా ఆపన్న హస్తం అందించింది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం, విశాఖపట్నం జిల్లా పాడేరులో 100 పడకల ఆస్పత్రుల ఏర్పాటుకు అమెరికాకు చెందిన అమెరికన్ ఇండియా ఫండ్ (ఎఐఎఫ్) ముందుకొచ్చిందని రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్పెషలాఫీసర్ డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఆస్పత్రిలోనూ 92 సాధారణ , 8 ఐసియు బెడ్స్ తో పాటు 46 సెల్లర్ ఇన్ స్టాండ్స్, సామగ్రిని భద్రపర్చుకునేందుకు 20 కప్ బోర్డులు, ఆస్పత్రి సిబ్బంది కోసం 4 టేబుళ్లు, 30 కుర్చీలతో ఒక వర్క్ స్టేషన్ ఏర్పాటు చేస్తారని ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు 15 విశ్రాంతి గదులు, 10 ఎల్పిఎం సామర్థ్యంతో 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 10 నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్ల వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారని ఆయన వివరించారు. దీనికోసం ప్రతి ఆస్పత్రికి రూ.4 కోట్ల చొప్పున ఎఐఎఫ్ సంస్థ నిధులు సమకూరుస్తుందన్నారు. అమెరికన్ ఇండియా ఫండ్ చేస్తున్న ఈ సాయంతో తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో మారుమూల ప్రాంతాలలో వైద్య సౌకర్యాలకు దూరంగా వున్న గిరిజనులకు వైద్య సౌకర్యాలు సమకూరుతాయన్నారు. ఈ సాయం అందిస్తున్న ఎఐఎఫ్ సంస్థకు డాక్టర్ అర్జా శ్రీకాంత్ ధన్యవాదాలు తెలిపారు.

Readmore:టీడీపీ కార్పొరేటర్ ఆనంద్ తాగి సచివాలయ సిబ్బంది పై దౌర్జన్యం