నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
విధాత,వెలగపూడి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధతతో పాటు కోవిడ్–19 నివారణ, నియంత్రణ చర్యలు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నగరాలు, పట్టణాల్లో మధ్యతరగతి వర్గాల ప్రజలకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి సంబంధించి విధివిధానాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.విజయనగరం, ఒంగోలులో విశ్వవిద్యాలయాల ఏర్పాటు, మరిన్ని 104 వాహనాల కొనుగోలు, పశు […]

విధాత,వెలగపూడి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధతతో పాటు కోవిడ్–19 నివారణ, నియంత్రణ చర్యలు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నగరాలు, పట్టణాల్లో మధ్యతరగతి వర్గాల ప్రజలకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి సంబంధించి విధివిధానాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.
విజయనగరం, ఒంగోలులో విశ్వవిద్యాలయాల ఏర్పాటు, మరిన్ని 104 వాహనాల కొనుగోలు, పశు వైద్యానికి సంబంధించి అంబులెన్స్‌ల ఏర్పాటు తదితర విషయాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.