CM Chandrababu | మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. ఆటో డ్రైవర్‌కు ఎలక్ట్రిక్ ఆటో అందజేత
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆటో డ్రైవర్‌కు ఇచ్చిన మాట మేరకు ఎలక్ట్రిక్ ఆటో అందించి మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల గుడివాడ పట్టణం రామబ్రహ్మం పార్కులో అన్నా క్యాంటీన్‌ను పునఃప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రేమల్లి రజినీకాంత్ మాట్లాడించారు

విధాత, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆటో డ్రైవర్‌కు ఇచ్చిన మాట మేరకు ఎలక్ట్రిక్ ఆటో అందించి మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల గుడివాడ పట్టణం రామబ్రహ్మం పార్కులో అన్నా క్యాంటీన్‌ను పునఃప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రేమల్లి రజినీకాంత్ మాట్లాడించారు.
ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్య చదివిస్తున్నానని తెలిపారు. అతని కృషిని అభినందించిన చంద్రబాబు అతడికి బ్యాటరీ ఆటో సమకూరుస్తానని హామీనిచ్చారు. ఈ మేరకు రజినీకాంత్‌కు రూ.3.9 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటో అందించారు. సదరు ఆటోను అధికారులు రజనీకాంత్‌కు అందించారు. చంద్రబాబు తనకిచ్చిన మాట నిలబెట్టుకుని ఎలక్ట్రిక్ ఆటో అందించడం పట్ల రజనీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు.