క్రికెటర్‌ భరత్‌కు ఏపీ ప్రభుత్వం వరాలు

క్రికెటర్‌ భరత్‌కు ఏపీ ప్రభుత్వం వరాలు

విధాత: టీమిండియా క్రికెటర్‌, వికెట్‌ కీపర్‌ కేఎస్‌. భరత్ కు ఏపీ ప్రభుత్వం వరాలు ప్రకటించింది. గ్రూప్-1ఆఫీసర్ ఉద్యోగం, వెయ్యి గజాల ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని తెలిపింది.


ప్రభుత్వ నిర్ణయాలను మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. రంజీ మ్యాచ్‌ల్లో, ఏపీఎల్‌లో సత్తా చాటి టీమిండియాకు ఎంపికై జట్టు గెలుపుకు పలు కీలక ఇన్నింగ్స్‌ను ఆడటంతో పాటు ఉత్తమ వికెట్‌ కీపింగ్‌ ప్రదర్శించాడు. టెస్టులు, వన్డేలు, టీ.20ల్లోనూ భరత్‌ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.