ఏపీ హైకోర్టుకు న‌లుగురు అద‌న‌పు న్యాయ‌మూర్తులు

ఏపీ హైకోర్టుకు న‌లుగురు అద‌న‌పు న్యాయ‌మూర్తులు

న్యూఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టుకు న‌లుగురు అద‌న‌పు న్యాయ‌మూర్తుల‌ను సుప్రీం కోర్టు నియ‌మించింది. ఈ న‌లుగురూ ఏపీ చెందిన న్యాయ‌వాదులే కావ‌డం గ‌మ‌నార్హం. వీరిలో హ‌రినాథ్ నూనెప‌ల్లి, కిర‌ణ్మ‌యి మండ‌వ అలియాస్ కిరణ్మ‌యి క‌న‌ప‌ర్తి, సుమ‌తి జ‌గ‌డం, న్యాప‌తి విజ‌య్ ఉన్నారు.


వీరితోపాటు బాంబే హైకోర్టుకు ముగ్గురు జుడిషియ‌ల్ అధికారుల‌ను అద‌న‌పు న్యాయ‌మూర్తులుగా నియ‌మించింది. కేర‌ళ హైకోర్టుకు ముగ్గురు, ఢిల్లీ హైకోర్టుకు ఇద్ద‌రు అద‌న‌పు న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క‌, త్రిపుర‌కు ఒక‌రు చొప్పున అద‌న‌పు న్యాయ‌మూర్తుల‌ను, త్రిపుర‌కు ఒక న్యాయ‌మూర్తిని నియ‌మిస్తూ బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాజ‌స్థాన్‌కు తెలంగాణ హైకోర్టు నుంచి జ‌స్టిస్ మ‌న్నూరి ల‌క్ష్మ‌ణ్‌, పాట్నా హైకోర్టుకు జ‌స్టిస్ జీ అనుప‌మ చ‌క్ర‌వ‌ర్తిని పంపారు