తెలంగాణ తీరుపై ప్రధాని కి లేఖ: మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్

విధాత‌,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాలకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నామని జలవనరులశాఖ మంత్రి అనిల్‌ స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాషను వాడుతున్నారు. వైఎస్‌ను అవమానించేలా తెలంగాణ మంత్రులు మాట్లాడటం సరికాదు. సాగునీటి అవసరాల తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి ఉండాలి. తక్కువ సమయంలో నీళ్లు తీసుకోవాలంటే సామర్థ్యం పెంచక తప్పదు. అసవరమైతే ఎంతదూరమైనా వెళ్తాం. ఇష్టానుసారం విద్యుదుత్పత్తి చేసుకుంటే కేఆర్‌ఎంబీ ఎందుకు?. అవసరమైతే రెండు రాష్ట్రాల ప్రాజెక్టులను […]

తెలంగాణ తీరుపై ప్రధాని కి లేఖ: మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్

విధాత‌,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాలకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నామని జలవనరులశాఖ మంత్రి అనిల్‌ స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాషను వాడుతున్నారు. వైఎస్‌ను అవమానించేలా తెలంగాణ మంత్రులు మాట్లాడటం సరికాదు. సాగునీటి అవసరాల తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి ఉండాలి. తక్కువ సమయంలో నీళ్లు తీసుకోవాలంటే సామర్థ్యం పెంచక తప్పదు. అసవరమైతే ఎంతదూరమైనా వెళ్తాం. ఇష్టానుసారం విద్యుదుత్పత్తి చేసుకుంటే కేఆర్‌ఎంబీ ఎందుకు?. అవసరమైతే రెండు రాష్ట్రాల ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిద్దాం. పాలమూరు, దిండి, నెట్టెంపాడు విస్తరణకు ఆమోదం లేదు. మా సంయమనం చేతకాని తనం కాదు. శ్రీశైలం జలాశయం నిండకూడదని తెలంగాణ భావిస్తోంది. తెలంగాణ తీరుపై ఇవాళే ప్రధానమంత్రి, జల్‌శక్తి మంత్రికి లేఖ రాస్తున్నాం’’ అని మంత్రి అనిల్‌ వెల్లడించారు.
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రైతుల అవసరాల గురించి కూడా తెలంగాణ ఆలోచించట్లేదన్నారు. శ్రీశైలం డెడ్‌లైన్‌ నిల్వ నీటిని కరెంట్‌ పేరుతో వాడటం దుర్మార్గమన్నారు. చేసేపని తప్పా, ఒప్పా అని కూడా తెలంగాణ ఆలోచించట్లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రవర్తనను మంత్రి మండలి తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు.