సిటింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలువురు సిటింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్లు ఆపార్టీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు

– సంక్రాంతి తర్వాత పార్టీలో పెనుమార్పులు
– ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు
విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలువురు సిటింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్లు ఆపార్టీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి తర్వాత పార్టీలో పెనుమార్పులు రాబోతున్నాయని స్పష్టం చేశారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఈనెల 17న రాష్ట్రానికి వస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఎన్నికల ప్ర్ర్రక్రియ, శాసనసభ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు కసరత్తును ప్రారంభిస్తారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల రాకను పార్టీ అధ్యక్షుడిగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. షర్మిల అవసరం ఎక్కడుందో అక్కడ ఆమెకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగిస్తుందని వివరించారు. షర్మిల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలపై గిడుగు స్పందిస్తూ.. ఆయన వ్యక్తిగతమని తోసిపుచ్చారు. సీపీఐ, సీపీఎంతో వారం రోజుల్లోనే భేటీ అవుతున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా పొత్తులపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.