సెప్టెంబర్ 27న జరిగే భారత్ బంద్ కు APUCF మద్దతు

విధాత‌: ఈ నెల 27వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు జరగనున్న భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య తన పూర్తి మద్దతును తెలుపుతోంది.రైతాంగ వ్యతిరేకమైన వ్యవసాయ చట్టాలకు,ప్రజావ్యతిరేక కేంద్ర విద్యుత్ చట్ట సవరణలకు, పెట్రోలు, డీజిల్ ,వంట గ్యాస్ ధరల పెంపుకు, కార్మిక హక్కులు హరించే కార్మిక కోడ్ లకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్ న్యాయ సమ్మతమైనది.పట్టణాలకు ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు ఇతర […]

సెప్టెంబర్ 27న జరిగే భారత్ బంద్ కు APUCF మద్దతు

విధాత‌: ఈ నెల 27వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు జరగనున్న భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య తన పూర్తి మద్దతును తెలుపుతోంది.రైతాంగ వ్యతిరేకమైన వ్యవసాయ చట్టాలకు,ప్రజావ్యతిరేక కేంద్ర విద్యుత్ చట్ట సవరణలకు, పెట్రోలు, డీజిల్ ,వంట గ్యాస్ ధరల పెంపుకు, కార్మిక హక్కులు హరించే కార్మిక కోడ్ లకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్ న్యాయ సమ్మతమైనది.పట్టణాలకు ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు ఇతర నిత్యావసర సరుకులు అందించే గ్రామీణ ప్రాంత రైతులు, ఇతర వర్గాల జీవితాలు దెబ్బతింటే దాని ప్రభావం పట్టణ ప్రాంత ప్రజలపై కూడా ఉంటుంది. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది.కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాల పేరుతో వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి రైతాంగానికి ద్రోహం చేస్తున్నది.మరోవైపు కేంద్ర ప్రభుత్వం పట్టణ సంస్కరణల పేరిట ఆస్తి విలువ ఆధారిత పన్ను , చెత్త పన్ను, మంచినీరు, డ్రైనేజీ ఛార్జీల పెంపు, యూజర్ చార్జీల విధింపుతో పట్టణ ప్రజలను దెబ్బతీస్తున్నది.

కేంద్ర విద్యుత్ చట్ట సవరణలు, విద్యుత్ సంస్కరణల వలన విద్యుత్ ఛార్జీలు మరింత పెరుగుతాయి. విద్యుత్ రంగ ప్రైవేటీకరణతో అన్నివర్గాల ప్రజలపై భారం పడుతుంది. సబ్సిడీలు రద్దు అవుతాయి.ఇటువంటి ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా జరిగే భారత్ బంద్ కు సమాఖ్య తన పూర్తి మద్దతును తెలుపుతోంది. రైతాంగ పోరాటానికి తన సంఘీభావం ప్రకటిస్తోంది.పట్టణాలలోని పౌర సంఘాలు, నివాస ప్రాంతాల సంఘాలు, కాలనీ, అపార్ట్ మెంట్ అసోసియేషన్లు రైతాంగ పోరాటానికి మద్దతుగా, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా జరిగే ఈ బంద్ కు మద్దతు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సిహెచ్.బాబూరావు.