ముఖ్యనేతలతో బాబు భేటీ
విధాత: టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్యనేతల భేటీ అయ్యారు. జగన్ పాలనలో నిర్వీర్యమవుతున్న సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి రంగాన్ని జగన్‌రెడ్డి అజ్ఞానంతో నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరం, నదుల అనుసంధానాన్ని కమీషన్ల కోసం అస్తవ్యస్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు లోపల మరో ఎత్తిపోతల పథకం అంటున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రజలకు అప్పులు.. జగన్ బినామీలకు ఆస్తులు పెరిగాయని […]

విధాత: టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్యనేతల భేటీ అయ్యారు. జగన్ పాలనలో నిర్వీర్యమవుతున్న సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి రంగాన్ని జగన్‌రెడ్డి అజ్ఞానంతో నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరం, నదుల అనుసంధానాన్ని కమీషన్ల కోసం అస్తవ్యస్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు లోపల మరో ఎత్తిపోతల పథకం అంటున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రజలకు అప్పులు.. జగన్ బినామీలకు ఆస్తులు పెరిగాయని ఆరోపించారు. రాంకీ, హెటిరో సహా బినామీ కంపెనీల్లో వేల కోట్ల బ్లాక్‌మనీ ఉందని చంద్రబాబు తెలిపారు.