చంద్రబాబు కొత్త కాన్సెప్ట్‌: నా వల్లే ITఉద్యోగులకు లక్షల జీతాలు.. టీడీపీకి రాయల్టీ కట్టాలి!

విధాత‌: టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సాఫ్ట్‌వేర్‌, ఐటీ రంగ ఉద్యోగులంతా తమ జీతంలో ఒకశాతం టీడీపీకి విరాళంగా ఇవ్వాలట. తాను కృషి చేయబట్టి, సంకల్పించబట్టి ఐటీ సెక్టార్ ఇంతగా వృద్ధి చెందిందని, అంతవరకూ పదివేలు జీతాలు తీసుకునేవాళ్లు ఇప్పుడు లక్షల జీతాలకు చేరడం అంటే అదంతా తన వల్లే కాబట్టి వారంతా టీడీపీ పార్టీ ఫండ్ కింద ఒకశాతం జీతాన్ని విరాళంగా ఇవ్వాలంటూ ప్రతిపాదన పెట్టారు. ఇదేమి ఖర్మ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి […]

చంద్రబాబు కొత్త కాన్సెప్ట్‌: నా వల్లే ITఉద్యోగులకు లక్షల జీతాలు.. టీడీపీకి రాయల్టీ కట్టాలి!

విధాత‌: టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సాఫ్ట్‌వేర్‌, ఐటీ రంగ ఉద్యోగులంతా తమ జీతంలో ఒకశాతం టీడీపీకి విరాళంగా ఇవ్వాలట. తాను కృషి చేయబట్టి, సంకల్పించబట్టి ఐటీ సెక్టార్ ఇంతగా వృద్ధి చెందిందని, అంతవరకూ పదివేలు జీతాలు తీసుకునేవాళ్లు ఇప్పుడు లక్షల జీతాలకు చేరడం అంటే అదంతా తన వల్లే కాబట్టి వారంతా టీడీపీ పార్టీ ఫండ్ కింద ఒకశాతం జీతాన్ని విరాళంగా ఇవ్వాలంటూ ప్రతిపాదన పెట్టారు.

ఇదేమి ఖర్మ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో ఆయన మాట్లాడుతూ అలా అన్నారు. ఆ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో దేశంలో వందలాది పరిశ్రమలు, గనులు, రైల్వేలు, ఇతర రంగాలు ఘనంగా ప్రారంభమై కొట్లాది మంది ఉపాధిని పొందుతున్నారు. దేశ ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే అందులో పని చేస్తున్నవారు ఉద్యోగాలు పొంది జీతాలు ఆర్జిస్తున్న వారంతా కాంగ్రెస్ పార్టీకి జీతం లోంచి ఒక శాతాన్ని విరాళంగా ఇస్తారా అన్న డౌట్లు వస్తున్నాయి.

సరే ఏదైతేనేం మళ్లీ చంద్రబాబు ఫామ్‌లోకి వచ్చేశారు. విద్యుత్ నేనే కనిపెట్టాను, ఇతరత్రా అభివృద్ధి కూడా నాదే.. అంటున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన ఇలాగే అన్నారు. నేను ఇచ్చిన పెన్షన్లు, నేను వేసిన రోడ్లు వాడుకుంటూ నాకు ఓట్లు వేయరా అని ప్రజలని ప్రశ్నించారు.

కానీ అప్పట్లోనే ఆ మాటలు ఘోరంగా ట్రోలింగ్‌కు గురయ్యాయి. మళ్లీ ఇప్పుడు కూడా సాఫ్ట్ వేర్ నాదే, నేనే డెవలప్ చేశాను రాయల్టీ కట్టండి అంటున్నారు. దీనిపై కూడా వైసీపీ సోషల్ మీడియా దాడి మొదలు పెట్టింది. లెమన్ టీ తెలుసు.. అల్లం టీ తెలుసు.. మరి ఈ రాయల్ టీ ఏందివయ్యా అని అంద‌రూ అనుకుంటున్నారు.