చంద్రబాబు ఆస్తుల వివరాలు మీకెందుకూ??.. లక్ష్మీ పార్వతికి సుప్రీం ప్రశ్న!

ఉన్న‌మాట‌: చంద్రబాబు అవినీతి చేసి భారీగా ఆస్తిపాస్తులు పోగేశారని ఆరోపిస్తూ, ఆ వివరాలన్నీ బహిర్గతం చేసేందుకు లక్ష్మీ పార్వతి చేసిన ప్రయత్నాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అసలు ఆ ఆస్తుల మీద విచారణకు అవకాశం ఇవ్వనేలేదు సరికదా.. ఆయన ఆస్తుల గురించి మీకెందుకూబని కోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరడానికి మీరెవరని లక్ష్మీ పార్వతిని సుప్రీంకోర్టు నిలదీసింది. దీంతో తాను మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ […]

చంద్రబాబు ఆస్తుల వివరాలు మీకెందుకూ??.. లక్ష్మీ పార్వతికి సుప్రీం ప్రశ్న!

ఉన్న‌మాట‌: చంద్రబాబు అవినీతి చేసి భారీగా ఆస్తిపాస్తులు పోగేశారని ఆరోపిస్తూ, ఆ వివరాలన్నీ బహిర్గతం చేసేందుకు లక్ష్మీ పార్వతి చేసిన ప్రయత్నాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అసలు ఆ ఆస్తుల మీద విచారణకు అవకాశం ఇవ్వనేలేదు సరికదా.. ఆయన ఆస్తుల గురించి మీకెందుకూబని కోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరడానికి మీరెవరని లక్ష్మీ పార్వతిని సుప్రీంకోర్టు నిలదీసింది.

దీంతో తాను మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతనని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ సతీమణి అయినంత మాత్రాన అది అదనపు అర్హత అవుతుందా అని సుప్రీంకోర్టు మండిపడింది. వేరేవారి ఆస్తులు గురించి తెలుసుకోవడానికి మీకేం హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎవరి ఆస్తులు ఎవరికి తెలియాలని లక్ష్మీపార్వతికి కోర్టు ప్రశ్నించింది. ఈ పిటిషన్ను ఇప్పటికే మీరు హైకోర్టులో వేస్తే హైకోర్టు కొట్టేసిందని దేశ అత్యున్నత న్యాయస్థానం గుర్తు చేసింది.

లక్ష్మీపార్వతి లేవనెత్తిన అంశంలో ఎలాంటి విలువ లేదని ఆమె పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కాగా చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ గతంలో లక్ష్మీపార్వతి హైకోర్టులో పిటిషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ట్రయల్ కోర్టులో హైకోర్టులో లక్ష్మీపార్వతి చేసిన పిటిషన్లను కోర్టులు కొట్టేశాయి.

చంద్రబాబుకు లక్ష్మీపార్వతికి మధ్య రాజకీయ వైరం ఉందన్న విషయాన్ని కూడా గతంలోనే హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. రాజకీయ కారణాలు వ్యక్తిగత విభేదాలతోనే ఆయనపై లక్ష్మీపార్వతి కేసు వేసిందని ప్రతివాది తరఫు వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె పిటిషన్ను కొట్టేస్తూ సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువరించింది.