నాగార్జునా సాగర్ లో ఎర్ర చందనం స్వాధీనం (వీడియో)
విధాత : నాగార్జున సాగర్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తనిఖీ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు మంగళవారం సుమారు 20 లక్షల ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండు మినీ బోలేరో ట్రక్స్ లో అక్రమంగా హైదరాబాద్ నుంచి చీరాలకు చేపల మేత బస్తాలు క్రింద తరలిస్తుండగా చెక్ పోస్టు సిబ్బంది పట్టుకున్నారు.నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, రెండు వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు విజయపురి సౌత్ పోలీసులు కాగా పట్టుపడిన […]

విధాత : నాగార్జున సాగర్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తనిఖీ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు మంగళవారం సుమారు 20 లక్షల ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
రెండు మినీ బోలేరో ట్రక్స్ లో అక్రమంగా హైదరాబాద్ నుంచి చీరాలకు చేపల మేత బస్తాలు క్రింద తరలిస్తుండగా చెక్ పోస్టు సిబ్బంది పట్టుకున్నారు.నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, రెండు వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు విజయపురి సౌత్ పోలీసులు
కాగా పట్టుపడిన ఎర్ర చందనం దుంగలను అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి పరిశీలించి తనిఖీల్లో పాల్గొన్న సాగర్ బోర్డర్ చెక్ పోస్టు సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గురజాల డిఎస్పీ జయరాం ప్రసాద్, మాచర్ల రూరల్ సిఐ సురేంద్రబాబు, పట్టణ సీఐ సుబ్బారావు, దుర్గి ఎస్ ఐ కే రవీంద్ర పాల్ నాగార్జు నసాగర్ ఎస్సై అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.