చంద్రబాబు హయాంలో చంద్రముఖి పాలన: సీఎం జగన్
ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు హయాంలో చంద్రముఖి పాలన సాగిందని, చంద్రబాబు అంటేనే చంద్రముఖి అని ఏపీ సీఎం వైఎస్. జగన్ విమర్శించారు.
ఒక్క జగన్ మీదకు ఇంతమంది తొడేళ్ల యుద్దం
నా స్కీమ్స్‌తో మీ డ్రీమ్స్ నేరవేర్చాను
చెల్లూరు మేమంతా సిద్ధం సభలో ఏపీ సీఎం జగన్
విధాత : ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు హయాంలో చంద్రముఖి పాలన సాగిందని, చంద్రబాబు అంటేనే చంద్రముఖి అని ఏపీ సీఎం వైఎస్. జగన్ విమర్శించారు. మంగళవారం విజయనగరం చెల్లూరులో మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపైన, కాంగ్రెస్‌పైన నిప్పులు చెరిగారు. ప్రజలకు మంచి చేసని ఒక్క జగన్ మీదకు ఇంతమంది తొడేళ్లు యుద్ధానికి వస్తున్నాయన్నారు. ఈ ఎన్నికలలో పెత్తందారులైన కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజల సిద్ధంగా ఉండాలన్నారు. చంద్రబాబు వెనుక దత్తపుత్రుడు ఉన్నాడని, బీజేపీ, కాంగ్రెస్‌లు ఉన్నాయని ఒకరు ప్రత్యక్షంగా, మరొకరు పరోక్షంగా మద్దతునిచ్చుకుంటూ నా ఒక్కడిపై యుద్దం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ ప్రజలను నమ్మించి మోసం చేసిన కూటమిని 420కూటమి అంటారని, దీనినే చంద్రముఖి బృందం కూడా అంటారన్నారు. నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి ప్రజలకు సిద్ధంగా ఉండాలన్నారు. సీఎం జగన్ ఎక్కడ లంచాలు వివక్ష లేకుండా బటన్ నొక్కి నేరుగా ప్రజలకు ఖాతాలలో డబ్బులు వేస్తున్నారన్నారు. ఇప్పటికే వివిధ స్కీమ్‌ల ద్వారా 2లక్షల 70వేల కోట్లు మీ ఖాతాల్లో మీ బిడ్డ జగన్ నేరుగా వేశారని చెప్పారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తు అని, వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మీ బిడ్డ జగన్ పాలనలో 30 లక్షల ఇళ్ల పట్టాలని పేద మహిళలకు అందించామని, దాదాపు 40 పథకాలను పేద మధ్యతరగతి ప్రజలకు అందించామమని, మీ డ్రీమ్స్‌ను నెరవేర్చేందుకు మీ బిడ్డగా నా స్కీమ్స్ అమలు చేశానని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram