క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
విధాత: గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా విజయవాడ బెంజి సర్కిల్ వద్ద లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్. మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రీల జయంతి సందర్భంగా ఇరువురి విగ్రహాలకు పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం జగన్.దివంగత ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం జగనన్న […]

విధాత: గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా విజయవాడ బెంజి సర్కిల్ వద్ద లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్.
మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రీల జయంతి సందర్భంగా ఇరువురి విగ్రహాలకు పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం జగన్.దివంగత ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించారు.
అనంతరం జగనన్న స్వచ్ఛ సంకల్పం– క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) సీడీని విడుదల చేసిన సీఎం,ఈ సందర్భంగా 4,097 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.చెత్త సేకరణకు ఉపయోగించే డస్ట్‌బిన్‌లు, వాహనాలను స్వయంగా పరిశీలించిన సీఎం జగన్.
కార్యక్రమంలో పాల్గొన్న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పురపాలక, పట్టణాభివృద్ధి స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు.