శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో సీఎం జగన్
విధాత: సీఎం వైఎస్ జగన్ విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి ఆశ్రమంలోని సుప్ర గణపతి, శ్యామకమలలోచన దత్తాత్రేయ, మరకత రాజరాజేశ్వరీ దేవి, గంగాధరేశ్వర స్వామి, శ్రీమాతే నామకోటి మండపం, కార్యసిద్ది హనుమాన్ ఆలయాలను దర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అవధూత, దత్తపీఠాధిపతి స్వామి గణపతి సచ్చిదానందని కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపి వి.విజయసాయిరెడ్డి, […]

విధాత: సీఎం వైఎస్ జగన్ విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి ఆశ్రమంలోని సుప్ర గణపతి, శ్యామకమలలోచన దత్తాత్రేయ, మరకత రాజరాజేశ్వరీ దేవి, గంగాధరేశ్వర స్వామి, శ్రీమాతే నామకోటి మండపం, కార్యసిద్ది హనుమాన్ ఆలయాలను దర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అవధూత, దత్తపీఠాధిపతి స్వామి గణపతి సచ్చిదానందని కలిశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపి వి.విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.