11,12 తేదీల్లో సీఎం జగన్‌ తిరుమల పర్యటన

విధాత‌: ఈ నెల 11,12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఈ సంద‌ర్భంగా తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల విభాగాన్ని ప్రారంభించనున్నారు.అలాగే అలిపిరి వద్ద గో మండపాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 12న ఉదయం శ్రీవారిని సీఎం వైఎస్‌ జగన్‌ దర్శించుకోనున్నారు. అనంతరం ఎస్వీబీసీ కన్నడ,హిందీ ఛానళ్లను, కొత్త బూందీపోటు భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. […]

11,12 తేదీల్లో సీఎం జగన్‌ తిరుమల పర్యటన

విధాత‌: ఈ నెల 11,12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఈ సంద‌ర్భంగా తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల విభాగాన్ని ప్రారంభించనున్నారు.అలాగే అలిపిరి వద్ద గో మండపాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 12న ఉదయం శ్రీవారిని సీఎం వైఎస్‌ జగన్‌ దర్శించుకోనున్నారు. అనంతరం ఎస్వీబీసీ కన్నడ,హిందీ ఛానళ్లను, కొత్త బూందీపోటు భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అన్నమయ్య, భవన్‌లో టీటీడీ, ఏపీ రైతు సాధికార సంస్థ మధ్య ఎంవోయూ, టీటీడీ కొత్తగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించనున్నారు.