పెన్సిల్ పోయిందని పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు (వీడియో వైరల్‌)

విధాత: పెన్సిల్ పోయిందని ఓ విద్యార్థి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యదు చేశాడు. ఈఘటన కర్నూలు జిల్లా పెద కడుబూరు పోలీస్‌స్టేషన్ లో జరిగింది. తాను హోంవ‌ర్క్ చేసుకుంటుంటే మ‌రో బాలుడు త‌న పెన్సిల్ ఎత్తుకెళ్లాడ‌ని ఫిర్యాదు చేశాడు. ఈ ఘ‌ట‌న క‌ర్నూల్ జిల్లాలోని పెద క‌డుబూరు ప‌రిధిలో జరి గింది. హ‌న్మంతు అనే విద్యార్థి పెన్సిల్‌ ను మ‌రో అబ్బాయి దొంగిలించాడు. దీంతో హ‌న్మంతు స్థానిక పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి ప్ర‌తిరోజు పెన్సి ల్ దొంగ‌త‌నం చేస్తున్నాడని, […]

పెన్సిల్ పోయిందని పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు (వీడియో వైరల్‌)

విధాత: పెన్సిల్ పోయిందని ఓ విద్యార్థి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యదు చేశాడు. ఈఘటన కర్నూలు జిల్లా పెద కడుబూరు పోలీస్‌స్టేషన్ లో జరిగింది. తాను హోంవ‌ర్క్ చేసుకుంటుంటే మ‌రో బాలుడు త‌న పెన్సిల్ ఎత్తుకెళ్లాడ‌ని ఫిర్యాదు చేశాడు.

ఈ ఘ‌ట‌న క‌ర్నూల్ జిల్లాలోని పెద క‌డుబూరు ప‌రిధిలో జరి గింది. హ‌న్మంతు అనే విద్యార్థి పెన్సిల్‌ ను మ‌రో అబ్బాయి దొంగిలించాడు. దీంతో హ‌న్మంతు స్థానిక పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి ప్ర‌తిరోజు పెన్సి ల్ దొంగ‌త‌నం చేస్తున్నాడని, పైస‌లు కూడా తీసుకుపోతు న్నాడని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

సార్ పెన్సిల్ తిరిగి ఇచ్చాను అని మ‌రో అబ్బాయి సంజా యిషీ ఇచ్చుకున్నా.. హ‌న్మంత్ మాత్రం విన‌లేదు. ఇదొక్క‌సారి కేసు పెట్టండి సార్ అని పోలీసుల‌ను అడిగాడు హ‌న్మంత్. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి స్టేష‌న్ నుంచి పంపించేశారు. హ‌న్మంత్ తీరుతో పోలీసులు స‌ర‌దాగా న‌వ్వుకున్నారు. ఇద్ద‌రూ బాగా చదువుకోవాల‌ని పోలీసులు సూచించారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి మరి.